భర్తకు పెళ్లి చేసిన భార్య… తెలంగాణాలో ఓ అతివ ఔదార్యం

దిశ దశ, వరంగల్:

భర్త వైపు పరాయి స్త్రీ కన్నెత్తి చూస్తేనే తట్టుకోలేని ఘటనలు చూశాం… మరో స్త్రీ తమ కుటుంబంలోకి వస్తే బావుండదని వ్యతిరేకించే ఘటనలూ చూశాం. కానీ ఆమె మాత్రం పూర్తిగా వ్యవహరించారు. మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో దాంపత్య జీవనం సాగిస్తున్నఓ భార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణాలోని మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే…

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సురేష్, సరితలు దాంపత్య జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు కూడా ఉన్నారు. అయితే వారి దగ్గరి బంధువు అయిన మానసిక వికలాంగురాలు సురేష్ ను ఇష్టపడుతోందని సరితకు తెలిసింది. దీంతో ఆమె జీవితానికి కూడా భరోసా కల్పించాలని భావించిన సరిత తన భర్తతో ఆమె వివాహం దగ్గరుండి జరిపారు. తమ బంధువుల అమ్మాయి అయిన సంధ్య సురేష్ ను ప్రేమించిన విషయం తెలిసిన సరిత తమ కుటుంబంలోకి ఆమెను ఆహ్వానించేందుకు వెనుకాడలేదు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో ఘనంగా పెళ్లి జరిపించారు. ఈ వివాహాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహించడంతో పాటు బంధువులను కూడా ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా సురేష్ మొదటి భార్య సరిత మీడియాతో మాట్లాడుతూ… సంధ్య తన భర్తకు వరస అయిన అమ్మాయని ఆమె తన భర్తను ప్రేమిస్తున్నదని తెలిసినందున పెళ్లి చేసుకునేందుకు సమ్మతించానన్నారు. భవిష్యత్తులో ఆమెకు బాసట ఇవ్వాలన్న భావనతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని వివరించారు.

You cannot copy content of this page