రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. కందుకూరు మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో గల ఫామ్ హౌస్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఫామ్ హౌస్‌లో కాపలాగా ఉండే మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డి-శైలజా రెడ్డి దంపతులు దాసర్లపల్లి సమీపంలో ఫామ్ హౌస్‌లో పనిచేస్తున్నారు. ఇవాళ రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంట్లో శైలజా రెడ్డి ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెను కత్తితో పొడిచి చంపారు. శుక్రవారం రాత్రి శైలజ సర్వెంట్ క్వార్టర్‌లో ఉండగా.. సురేందర్ ఫామ్ హౌస్ భవనంలో ఉన్నాడు. అక్కడికి వచ్చిన యజమాని కుటుంబ సభ్యులతో సురేందర్ ఉన్నాడు. ఆ సమయంలో కుక్కలు చాలాసేపు మొరగడం విని సురేందర్ తన గదిలోకి పరుగెత్తాడు. అక్కడ తన భార్య రక్తపు మడుగులో చనిపోయి పడి ఉండడాన్ని గమనించాడు.
శైలజా రెడ్డి ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి చంపాడు. వెంటనే మృతుడి భర్త పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న కందుకూరు పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కొందరు వ్యక్తులు కత్తితో మహిళను హత్య చేశారని వెల్లడించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు. దుండగుడిని గుర్తించి పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.