జాతీయ హోదా రద్దు కక్ష్య సాధింపు చర్యే

కేంద్ర వైఫల్యాలు ఎంగట్టేందుకే యాత్ర

సీపీఐ నేత చాడ ధ్వజం

దిశ దశ, హుజురాబాద్:

సీపీఐ జాతీయ హోదా రద్దు చేయడం ముమ్మాటికి కక్ష్య సాధింపు చర్యేనని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకే ప్రజా చైతన్య యాత్ర చేపట్టామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీపీఐ పార్టీ జాతీయ హోదా రద్దు చేయడం మోడీ ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యనని మండిపడ్డారు. దేశంలో దళితులపై దాడులు మరింత పెరిగాయని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సేవ్ డెమాక్రసి, సేవ్ కాని స్ట్యూషన్ అన్న నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 72లక్షల కోట్లు ప్రజలకు పంచుతామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 50వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆదాని రూ. 50లక్షల కోట్లకు ఎలా ఎదిగేలా చేసిందని మండిపడ్డారు. దేశంలో ఎమ్మెల్యేకు, ఎంపీలకు వెలగట్టే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని, ఇది ఆందోళనకరమన్నారు. దేశంలోని 26 రాష్ట్రాల్లో తమ పార్టీకి స్టేట్ కమిటీలు ఉన్నాయని, గుర్తింపు రద్దు చేయడం రాజకీయ కుట్రేనని చాడా వెంకటరెడ్డి ఆరోపించారు.నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని ఉమ్మడి అసెంబ్లీలో కొట్లాడిన వ్యక్తిని తానేనని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎంతమందికి ఇచ్చారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ నేత మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ… బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దగా చేస్తోందని, హిందూ మతోన్మాదశక్తులను ప్రేరేపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చడంలో విఫలమయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్, సీపీఐ మండలం నాయకులు రవీందర్ రెడ్డి, రాజు, చంద్రన్న, కొమురు మల్లు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page