కేటీఆర్ కాన్వాయిని అడ్డుకున్న ఏబీవీపీ

పోలీసుల ఎత్తుకు పైఎత్తు వేసిన విద్యార్థి సంఘం నాయకులు

రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కాన్వాయిని అడ్డుకున్నారు. సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్న నేపథ్యంలో ఏబీవీపి విద్యార్థులు పేపర్ల లీకేజీకి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కాన్వాయిని అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని, సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. కాన్వాయిని అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు పక్కకు నెట్టేసి వాహన శ్రేణిని పంపించారు. అనంతరం ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

మంత్రి కేటీఆర్ కాన్వాయిని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు



వ్యూహాత్మక ఆందోళన

అయితే ఏబీవీపీ విద్యార్థులు పోలీసుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆందోళన చేపట్టారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఉందనగానే పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీంతో మంత్రి పర్యటన సందర్భంగా నిరసనలకు తావు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వైపున నిఘా వర్గాలు కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మంత్రి పర్యటన ముగిసే వరకు కూడా ఆయా పార్టీల నాయకులను పోలీసులు వదిలేయడం లేదు. దీంతో రాజన్న జిల్లాకు చెందిన నాయకులను అక్కడి పోలీసులు గుర్తించే అవకాశం ఉందని గమనించిన ఏబీవీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కరీంనగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున సిరిసిల్లకు చేరుకుని మంత్రి కేటీఆర్ కాన్వాయి వెల్లే మార్గంలో కాపు కాసి వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్స్ విభాగ్ కన్వీనర్ మారవేని రంజిత్ కుమార్, మల్యాల రాకేష్, విష్ణు, ప్రశాంత్, శివ, శేషాద్రి, రాజ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page