ఏబీవీపీ ఆందోళన
గ్రూప్స్ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఏబీవీపీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. మంత్రులను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగుతోంది. సోమవారం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కాన్వాయిని అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా సమీపంలోని మీ సేవా కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. గ్రూప్స్ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్ తో ఈ నిరసన చేపట్టారు. ఏబీవీపీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గంగుల క్యాంప్ ఆఫీసుకు చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

