ఆ లంచంతో సంబంధం లేదు సీఐ వాదనలు… ఆధారాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు…

తొర్రూర్ సర్కిల్ కార్యాలయంలో టెక్నా‘లాజిక్’ ట్రాప్…

దిశ దశ, వరంగల్:

రెగ్యూలర్ కాల్ చేసినట్టయితే CDR ద్వారా పట్టుబడే ప్రమాదం ఉందని వాట్సప్ కాల్ లో మాట్లాడడంతో సేప్ అవుతామన్న అవినీతి  అధికారులకు  ఏసీబీకి సరికొత్తగా ఝలక్ ఇస్తోంది.  లంచం కోసం చేతులు చాపి చివరకు తమకు సంబంధం లేదని తప్పించుకున్నా వదిలే ప్రస్తకి లేదని ఏసీబీ అధికారులు తేల్చి చెప్తున్నారు. తాజాగా తొర్రూరు సీఐ కర్రి జగదీశ్వర్ విషయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి మరీ అరెస్ట్ చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు… గత సంవత్సరం అక్టోబర్ నెలలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీసులు పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని పట్టుకుని విచారణ జరుపుతారు. క్రైం నంబర్ 132/2024A నమోదు చేశారు. పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్టు తేల్చిన పోలీసులు నిందితులను విచారించాలని నిర్ణయిస్తారు. ఈ వ్యవహారంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రెబ్బెనకు చెందిన ఓ వ్యాపారి పేరు కూడా బయటకు రావడంతో పోలీసు అధికారులు అతనికి 35(3) బీఎన్ఎస్ యాక్టు ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరుతారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో తొర్రూర్ సీఐ జగదీష కూడా విచారించేందుకు పూనుకుంటారు. రెబ్బెనకు చెందిన సదరు వ్యాపారిని పిలిపించినప్పుడు తనకు పీడీఎస్ రైస్ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసులకు వివరించడంతో అతన్ని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తుండడంతో మామూళ్లు ఇచ్చేవరకు చేరింది. మొదట రూ. 5 లక్షలు డిమాండ్ చేయగా   సీఐకి రూ. 4 లక్షలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదురింది. ఇందులో ఫస్ట్ పేమెంట్ గా రూ. 2 లక్షలు ఇవ్వగా మిగతా డబ్బుల కోసం గత కొద్ది రోజలుగా సీఐ సదరు వ్యాపారిని అడుగుతున్నాడు.

వాట్సప్ కాల్ ద్వారా…

అయితే తనకు ఇస్తానన్న రూ. 4 లక్షల్లో మిగతా రూ. 2 లక్షలు ఇవ్వలేదని వాటిని త్వరగా పంపించాలని సీఐ జగదీష్ సదరు వ్యాపారికి తరుచూ ఫోన్లు చేస్తుండేవాడు. దీంతో ఆ వ్యాపారి సీఐ జగదీష్ వాట్సప్ కాల్ చేసి డబ్బులు అడుగుతున్న విషయాన్ని వేరే మొబైల్ లో రికార్డు చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వాట్సప్ కాల్ రికార్డ్ విన్నఏసీబీ అధికారులు సీఐ జగదీష్ ను పట్టుకునేందుకు పకడ్భందీ వ్యూహం రచించారు. వ్యాపారిచే మిగతా రూ. 2 లక్షలు సీఐ జగదీష్ కు ఇచ్చేందుకు  వ్యాపారి సుముఖత వ్యక్తం చేసినప్పుడు అనుమానించిన సీఐ డబ్బులు తీసుకునేందుకు విముఖత చూపుతారు. సీఐ జగదీశ్వర్, వ్యాపారి వాట్సప్ కాల్ ద్వారా మాట్లాడించిన ఏసీబీ అధికారులు లంచం డబ్బుల గురించి చర్చకు వస్తుంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేకమైన డివైజ్ వినియోగించి రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఆధునిక టెక్నాలజితో రికార్డు చేస్తారన్న విషయం తెలియని సీఐ వాట్సప్ కాల్ లోనే మాట్లాడుతున్నానన్న నమ్మకంతో కులుంకశంగా వ్యాపారితో చర్చిస్తాడు.

బుకాయించిన సీఐ..?

ఆధారాలను పక్కాగా సేకరించిన ఏసీబీ అధికారులు సోమవారం తొర్రూర్ సీఐ జగదీష్ కార్యాలయానికి వెల్లి సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. తాను అవినీతికి పాల్పడలేదని తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఏసీబీ అధికారులను సీఐ కర్రి జగదీష్ ఎదురు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. పీడీఎస్ రైస్ పట్టుకున్న కేసులో వ్యాపారిని డబ్బుల కోసం వేధించిన కేసులో అరెస్ట్ చేస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్పినా సీఐ వారితో వాదనలకు దిగినట్టుగా తెలుస్తోంది. చివరకు ఏసీబీ అధికారులు తమ వద్ద పక్కాగా ఆధారాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టడంతో సీఐ జగదీష్ తలొగ్గక తప్పలేదు. ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడిన కేసులో తొర్రూర్ సీఐని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ప్రకటించారు.

టెక్నా‘లాజిక్’…

అవినీతికి పాల్పడేందుకు టెక్నాలజీకి చిక్కకుండా అధికారయంత్రాంగం వ్యవహరిస్తే వారిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు కూడా ఆధునిక టెక్నాలజిని ఉపయోగిస్తున్నారు. తొర్రూర్ సీఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు సపరేట్ డివైజ్ ద్వారా రికార్డు చేసి పట్టుకోవడంతో ఈ విషయం  స్ఫష్టం అయింది. రెగ్యూలర్ కాల్ ద్వారా లంచం అడిగితే తాము దొరికిపోతాం కానీ, వాట్సప్ కాల్ ద్వారా తామెందుకు దొరుకుతామన్న ధీమాతో ఉన్నట్టయితే మాత్రం కటకటాల పాలు కాకతప్పదని ఏసీబీ అధికారులు చేతల్లోనే చూపించారు. లంచం డబ్బుల కోసం కక్కుర్తి పడే ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇక ముందు ప్రత్యామ్నాయ యాప్స్ ద్వారా డబ్బులు వసూళ్లకు పాల్పడే ప్రయత్నం చేసినా పట్టుకుని తీరుతామని తేటతెల్లం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 

You cannot copy content of this page