రిమాండ్ రిజక్ట్…
టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 24 గంటల క్రితం మొయినాబాద్ అజీజ్ నగర్ ఫాం హౌజ్ లో ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై అరెస్ట్ చేసిన ముగ్గురి రిమాండ్ ను ఏసీబీ న్యాయమూర్తి రిజక్ట్ చేశారు. టీఆరెఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్వామి రామచంద్ర భారతి, సింహయాజులు, నందు కుమార్ లపై ఐపీసీ 120-B, 171-B r/w 171-E 506 r/w 34 IPC & Sec 8 of Prevention of corruption Act-1988 section కింద కేసు నమోదు చేశారు. అయితే వీరిని గురువారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా సరైన ఆధారాలు లేవన్న కారణంగా రిమాండ్ ను న్యాయమూర్తి రిజక్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (PC) యాక్ట్ ఈకేసులో అప్లికెబుల్ కాదని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బ్రైబ్ అమౌంట్ లేక పోవటంతో రిమాండ్ ను ఏసీబీ న్యాయమూర్తి తోసిపుచ్చారు. 41crpc ప్రకారం నోటీసు ఇచ్చి విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు.