రూ. 5వేల లంచం… నాలుగేళ్ల జైలు శిక్ష 20 వేల ఫైన్

కరీంనగర్ ఏసీబీ కోర్టు తీర్పు

దిశ దశ, కరీంనగర్ లీగల్:

అవినీతి పాల్పడిన ఓ రెవెన్యూ ఉద్యోగికి శిక్ష విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. బుధవారం వెలువడిన ఈ తీర్పులో సదరు ఉద్యోగికి రూ. 20 వేల ఫైన్ తో పాటు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… తిమ్మాపూర్ కు చెందిన పెండ్యాల మహిపాల్ రెడ్డి 398, 399 సర్వే నెంబర్లలోని 1.04 ఎకరాల భూమిని తన భార్య పేరిట, సర్వే నెంబర్ 421లోని తన పేరిట పట్టాదారు కాలంలో మార్పిడీ చేయాలని అప్పటి వీఆర్వో నమలికొండ వెంకటరమణను అభ్యర్థించాడు. ఇందుకు వీఆర్వో లంచం ఇవ్వాలని అడగగా 2013 ఏప్రిల్ 6న మహిపాల్ రెడ్డి అతనికి రూ. 5 వేలు ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించాడు. ఈ కేసులో పూర్వాపరాలు విచారిండంతో పాటు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూాలాలను పరిశీలించిన కోర్టు అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వెంకటరమణ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.

You cannot copy content of this page