దిశ దశ, ఆదిలాబాాద్:
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏక కాలంలో రెండు చోట్ల దాడులు చేశారు. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో ఒక తహసీల్దార్, ఒక డిప్యూటీ తహసీల్దార్, పంచాయితీరాజ్ ఏఈ, పంచాయితీ సెక్రటరీలు లంచం తీసుకుంటుంటుంగా పట్టుకున్నారు.
పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం తీసుకుంటున్న జాయింట్ సబ్ రిజిస్ట్రారర్, డిప్యూటీ తహసీల్దార్లను ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం జాయిట్ సబ్ రిజిస్టారర్, తహసీల్దార్ రాజేశ్వరీ, డిప్యూటీ తహసీల్దార్ ఎం చిన్నయ్యలు రూ. 9 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ చేసిన అనంతరం వాంగ్మూలం తీసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం… జిల్లాలోని కడెం మండలం కొత్త మద్ది పడగ గ్రామానికి చెందిన లసెట్టి రాజన్న తన పెద్దనాన్న పేరిట ఉన్న భూమిని తనతో పాటు తన తమ్ముడి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలని తహసీల్దార్ ను కోరారు. అయితే ఇందుకు రూ. 15 వేల లంచం ఇవ్వాల్సి ఉంటుందని తహసీల్దార్ చెప్పడంతో రాజన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మళ్లీ తహసీల్దార్ ను కలిసి రూ. 15 వేలు ఇచ్చుకునే పరిస్థితి లేదని బాధితుడు తహసీల్దార్ ను కోరగా రూ. 9 వేలు ఇవ్వాలని తహసీల్దార్ చెప్పారు. దీంతో బుధవారం ఉదయం తమకు సంబంధించిన మూడు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసిన తరువాత డిప్యటీ తహసీల్దార్ కు రాజన్న రూ. 9 వేలు చిన్నయ్యకు ఇస్తుండగా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్ కు చెందిన రూ. 9 వేలు లంచం తీసుకున్న డిటి చిన్నయ్య, తహసీల్దార్ రాజేశ్వరీలను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో…
మంచిర్యాల జిల్లాలో కూడా ఏసీబీ దాడులు జరిగాయి. బుధవారం జరిగిన ఈ ఏసీబీ దాడుల్లో పంచాయితీ రాజ్ ఏఈ పరంజ్యోతి, పెర్కపల్లి పంచాయితీ కార్యదర్శి కమతం వీరబాబులను పట్టుకున్నారు. బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వీరిద్దరు బాధితుని నుండి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. క్రీడా మైదానానికి మట్టిని రవాణా చేసిన అశోక్ అనే వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ. 1.50 లక్షల బిల్లుకు సంబంధించిన ప్రాసెస్ చేయాలని ఏఈని కోరగా రూ. 15 వేలు లంచం అడగడంతో బాధితుడు అశోక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్ హైండెడెగా పట్టుకున్నారు.