పట్టుకున్న ఏసీబీ…
దిశ దశ, హైదరాబాద్:
సీబీఎస్సీ స్టాండర్డ్ తో తరగతులను అప్ గ్రేట్ చేసేందుకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ కోసం లంచం తీసుకుంటున్న ముగ్గురిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ కు చెందిన పాఠశాలలో సీబీఎస్సీ విద్యాబోధన చేసేందుకు అవసరమైన ఎన్ ఓ సి ఇవ్వాలని కె శెఖర్ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు రూ. 80 వేల లంచంగా ఇవ్వాలని హైదరాబాద్ రీజనల్ జాయింట్ డైరక్లర్ ఆఫీసులో పని చేస్తున్న అసిస్టెంట్ డైరక్టర్ అయిసోల సాయి పూర్ణ చందర్ రావు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు తమ ఫర్మాలిటీస్ ను కంప్టీల్ చేసుకుని గురువారం సాయంత్రం దాడి చేసి పట్టుకున్నారు. గురువారం సాయంత్రి 5.10 గంటల సమయంలో శేఖర్ లంచం ఇస్తుండగా పట్టుకుని కెమికల్ టెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు బాధితులు, ప్రత్యక్ష్య సాక్షుల వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో దొడ్డి జగదీశ్వర్ ఆఫీసు సూపరింటిండెంట్, ఆర్జేడీ పీఏ సతీష్ ల భాగస్వామ్యం కూడా ఉండడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ముగ్గురిని కూడా హైదరాబాద్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరు పరిచ్చినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.