రాష్ట్రంలో ఏసీబీ దాడులు

దిశ దశ, స్టేట్ బ్యూరో

రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో ఓ డీఈఓతో పాటు ఇద్దరు ఉద్యోగులు ట్రాప్ అయ్యారు. అవినీతి నిరోధక శాఖ అధికారులను బాధితులు కలిసిన తరువాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బాధితులు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు.

సంగారెడ్డిలో…

సంగారెడ్డి జిల్లాలోని ఆర్ సి పురం మండలం జ్యోతినగర్ కు అర్నాల్డ్ హైస్కూల్ లో ఐసీఎస్సీ సిలబస్ అమలు చేసేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కావాలని డీఈఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్స్ ఆఫ్ ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ నుండి పర్మిషన్ ఇవ్వాల్సిన ఈ ఫైలుకు సంగారెడ్డి డీఈఓ కార్యాలయం అధికారులు ఎన్ ఓ సి ఇవ్వాల్సి ఉంది. దీంతో స్కూల్ పీఈటీ మామిడి సోమ శేఖర్ ను రూ. 1.10 ఇవ్వాలని అడిగారు. మొదటి దఫాగా రూ. 50 వేలు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ట్రాప్ చేసిన వారిలో డీఈఓ నాంపల్లి రాజేష్, సీనియర్ అసిస్టెంట్ నక్క రామ కృష్ణా గౌడ్ లు పట్టుబడ్డారు. నిందితులను కెమికల్ టెస్ట్ చేయగా నిర్దారణ అయిందని, వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

జగిత్యాలలో

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి పంచాయితీ కార్యదర్శి మార విజయలక్ష్మీ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి నుండి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఎంజీఎన్ఆర్జీఎస్ పథకానికి సంబంధించిన రూ. 4లక్షల 24 వేల 412 విలువగల చెక్కులు సిద్దం చేయాలని కోరగా కార్యదర్శి లంచం అడగడంతో్ లక్ష్మారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి శుక్రవారం పట్టించారు. కెమికల్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కె భద్రయ్య మీడియాకు వివరించారు. నిందితురాలు విజయలక్ష్మీని కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. అయితే విజయలక్ష్మీ మాత్రం తనను బదిలీ చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నానని, ఇప్పటికీ ఈ పంచాయితీలో ఏడుగురు కార్యదర్శులు పనిచేసి బదిలీపై వెళ్లారన్నారు. తన వద్దకు కామన్ గా వచ్చిన లక్ష్మారెడ్డి మేడం ఈ డబ్బులు మీ వద్ద ఉండనివ్వండి అని ఇచ్చి పారిశుద్ద కార్మికులను పిలుచుకవస్తానని వెల్లాడన్నారు. బయటకు వెల్లిన ఆయన ఏసీబీ అధికారులను తీసుకొచ్చి తనను పట్టించారన్నారు.

రేచపల్లి ఏసీబీ ట్రాప్ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భద్రయ్య

You cannot copy content of this page