రెడ్ హైండెడ్ గా పట్టుకున్న ఏసీబీ…
దిశ దశ, భద్రాచలం:
లంచావతారులకు కొమ్ముకాస్తే జర్నలిస్టులను అయినా వదిలేది లేదని ఏసీబీ అధికారులు తేల్చి చెప్తున్నారు. అవినీతి అధికారికి అంటకాగిన వారెవరైనా సరే చట్టాలను ప్రయోగించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటనలో లంచం తీసుకుంటున్న సీఐతో పాటు ఈ వ్యవహారంలో మీడియేటర్ గా వ్యవహరించిన బిగ్ టీవీ రిపోర్టర్ ను పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో సీఐగా పని చేస్తున్న సతీష్ కుమార్ క్రైం నంబర్ 150/2025లో కేసులో నిందితుడిని తప్పించేందుకు రూ. 4 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపీ మధ్యవర్తిత్వం వహించాడు. మొదటి విడుతగా రూ. లక్ష తీసుకుంటున్న రిపోర్టర్ గోపిని రెడ్ హైండడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సీఐ సతీష్ కుమార్ పై కూడా అరెస్ట్ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు పకడ్భందీగా వ్యవహరించి ట్రాప్ చేశారు. కాగా పోలీసు అధికారులు లంచం తీసుకుంటున్న కేసులో బిగ్ టీవీ రిపోర్టర్ ను అరెస్ట్ చేయడం జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.