జగిత్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్

కమిషన్ కోసం కక్కుర్తి పడి… ఇద్దరు బలి…

దిశ దశ, జగిత్యాల:

అధికారులను మచ్చిక చేసుకోవడంతో పాటు వారిచ్చే కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డ ఇద్దరూ కేసులో ఇరుక్కొక తప్పలేదు. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నానన్న విషయాన్ని మరిచిపోయి ఒకరు… డాక్యమెంట్ రైటర్ గా జీవనం సాగిస్తున్న మరోకరు ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిని మార్ట్ గేజ్ చేయాలని సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దీన్ ను అభ్యర్థించాడు. అయితే ఈ పని పూర్తి చేయాలంటే కాంటాక్టు ఉద్యోగిగా ఉన్న బానోతు రవిని కలవాలని సూచించాడు. దీంతో బాధితుడు రవితో సంప్రదింపులు జరపగా రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చివరకు రూ. 5 వేలకు బేరం కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది లంచం వేధింపుల గురించి వివరించాడు. బుధవారం బాధితుని నుండి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా కాంట్రాక్ట్ ఉద్యోగి బానోతు రవిని రెడ్ హైండెగ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో సబ్ రిజిస్ట్రార్ ఆసీఫోద్దీన్, కాంట్రాక్ట్ ఉద్యోగి బి రవి, డాక్యూమెంట్ రైటర్ ఏ రవి లపై కేసు నమోదు చేశారు. కెమికల్ టెస్ట్ లో కూడా నిర్దారణ కావడంతో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చేందుకు ఏసీబీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.

You cannot copy content of this page