దిశ దశ, హుజురాబాద్:
అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏసీబీ కొరడా ఝులిపిస్తున్నా మార్పు రావడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ రెడ్ హైండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమికి నాలా కన్వర్షన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. కెమికల్ టెస్టు అనంతరం వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.