ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం లంచం… ఏసీబీ ట్రాప్…

దిశ దశ, కరీంనగర్:

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఝులు విధిల్చినా లంచావతారాలు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. ప్రతి విషయంలోనూ చేతులు తడపనిదే పని చేయం అంటున్న కొంతమంది ప్రభుత్వ యంత్రాంగం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కరీంనగర్ లో ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో జిల్లా సహకార  మార్కెటింగ్ సొసైటీ (డీసీఎమ్మెఎస్)లు పట్టుబడ్డారు. గురువారం కరీంనగర్ డీసీఎమ్మెఎస్ కార్యాలయంలో జరిగిన దాడుల్లో డీసీఎమ్మెఎస్ మేనేజర్ వెంకటేశ్వర్ రావు, క్యాషీయర్ కుమార స్వామిలు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుబడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు లంచం డిమండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి నేతృత్వంలోని బృందం గురువారం ఏసీబీ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకుంది. కెమికల్ టెస్ట్ పూర్తయిన తరువాత వాంగ్మూలాలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. మరిన్ని వివరాలు తెలియ రావల్సి ఉంది.

You cannot copy content of this page