లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీఓ
దిశ దశ. పెద్దపల్లి:
రిటైర్డ్ ఉపాధ్యాయునికి రావల్సిన ఏరియర్స్ డ్రా చేసుకునేందుకు అవసరమైన బిల్లులు సిద్దం చేసేందుకు లంచం అడిగిన STO, సబార్డినేట్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… పదవి విరమణ పొందిన ఓ ఉపాధ్యాయుడు తన పెన్షన్ తాలుకు ఏరియర్స్ తో పాటు ఇతరాత్ర బెనిఫిట్స్ కు సంబంధించిన డబ్బులను డ్రా చేసుకునేందుకు బిల్లులు మంజూరు చేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ ట్రెజరీ ఆఫీసర్ ను కోరారు. దీంతో రిటైర్డ్ టీచర్ కరీంనగర్ ACB డీఎస్పీ రమణ మూర్తిని కలిసి రామగుండం ఎస్టీఓ ఆఫీసులు లంచం అడిగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో గురువారం రిటైర్డ్ టీచర్ ఎస్టీఓ మహేశ్వర్, సబార్డినేట్ పవన్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అనంతరం వాంగ్మూలాలు తీసుకుంటున్న ఏసీబీ అధికారులు నిందితులను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నారు. పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.