జగిత్యాల జిల్లాలో సంచలనం… తప్పించుకున్న ఎస్సై..?

దిశ దశ, జగిత్యాల:

ఏసీబీ అధికారులకు చివరి క్షణంలో చిక్కకుండా తప్పించుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుండి డబ్బులు తీసుకునే క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకోవాలని వ్యూహం రచించారు. అయితే వారిని గమనించిన ఎస్సై తప్పించుకున్నారు. జిల్లాలోని రాయికల్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఇసుక ట్రాక్టర్ల రవాణా విషయంలో చోటు చేసుకున్న లావాదేవీల్లో అక్కడి ఎస్సైకి రూ. 25 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. మధ్యవర్తి ద్వారా ఈ డబ్బులు ఇచ్చేందుకు నిర్ణయం జరగగా డబ్బులు తీసుకుంటున్న క్రమంలో ఎస్సైని రెడ్ హైండెడ్ గా పట్టివ్వాలని బాధితులు నిర్ణయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో… శుక్రవారం రాత్రి 11 గంటల నుండి 12 గంటల ప్రాంతంలో బాధితులు, ఏసీబీ అధికారులు స్టేషన్ కు చేరుకున్నారు. అయితే ఎస్సైని పోలీస్ స్టేషన్ కు పిలిపించగా ఆయన స్టేషన్ కు చేరుకున్న తరువాత ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై వెంటనే వెనక్కి వెల్లిపోయారు. దీంతో అతన్ని పట్టుకోలేకపోయిన ఏసీబీ అధికారులు మిడియేటర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఎస్సై ఆచూకి కోసం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. 

You cannot copy content of this page