ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి దరఖాస్తులు…

ప్రతి ఒక్కరూ రుసుం చెల్లించాల్సిందే…

ఈ నెల 25 వరకు గడువు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుండి టీపీసీసీ దరఖాస్తులు తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఈ నెల 25 వరకు ఆశావాహులు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీలయితే రూ. 25 వేలు, ఓసీ, బీసీలయితే రూ. 50 వేల రుసుం చెల్లించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ అనంతరం స్క్రూటినీ చేపట్టి అర్హులైన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సర్వే చేస్తామన్నారు. ఈ సర్వేలో అభ్యర్థులు బలాలు, బలహీనతలు, సామాజిక సమీకరణలపై సమగ్ర వివరాలపై ఆరా తీస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని వడబోసిన జాబితాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తుందని ఆ కమిటీ తుది జాబితాను తయారు చేస్తుందని టీపీసీసీ చీఫ్ ప్రకటించారు.

You cannot copy content of this page