మేళ్ళ చెరువు సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం…

దిశ దశ, సూర్యపేట:

సూర్యపేట జిల్లా మేళ్ల చెరువు మై హోమ్స్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించడం లేదు. ఈ పరిశ్రమలో నిర్మిస్తున్న నాలుగవ ప్లాంట్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా సమాచారం. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలిపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులు కిందపడిపోయారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 14 మంది వరకు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కార్మికులంతా కూడా ఉత్తరప్రదేష్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలేనని సమాచారం. అయితే ఈ ప్రమాద విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతుండడంతో పూర్తి వివరాలు తెలియరావడం లేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You cannot copy content of this page