అతి క్రూరంగా వ్యవహరించిన నిందితులు… జర్నలిస్ట్ ముఖేష్ మర్డర్ కేసు

పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు…

దిశ దశ, దండకారణ్యం:

కాంట్రాక్టు పనుల్లో జరుగుతున్న అక్రమాలను బట్టబయలు చేసిన బీజాపూర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ ను అత్యంత దారుణంగా చంపారు హంతకులు. బంధువు కూడా అయిన చంద్రాకర్ విషయంలో నిందితులు ఏ మాత్రం కనికరం కూడా చూపకపోవడం పలువురిని కలిచివేసింది. ముఖేష్ చంద్రాకర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా షాకుకు గురయ్యారంటే అతన్ని ఏ స్థాయిలో హిసించి చంపారో అర్థం చేసుకోవచ్చు. తన 12ఏళ్ల వైద్య వృత్తిలో ఇంతటి ఘోరమైన హత్యను తాను చూడలేదని డాక్టర్ వ్యాఖ్యానించారంటే హంతకులు ఎంతటి క్రూరంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ చట్టాపారాలో అక్రమంగా నిర్మించకున్న ఫాంహౌజ్ లో ముఖేష్ చంద్రాకర్ ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. హంతకులు ముఖేష్ ను చంపేముందు అతి దారుణంగా హింసించినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అతని తలలో 15 ఫ్యాక్చర్లు ఉండగా గుండె పగిలి బయటకు వచ్చిందని, కాలేయం నాలుగు ముక్కలు అయిందని, పక్కటెముకలు, మెడ భాగదంలోని ఎముకలు కూడా విరిగిపోయాయని, చేతి ఎముక కూడా విరిగిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్టులో వైద్యులు నివేదిక ఇచ్చారని బీజాపూర్ మీడియా పేర్కొంది. అతని మొఖంపై కూడా బలమైన ఆయుధంతో దాడి చేసి ఉంటారని కూడా ఆ నివేదికలో వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టును బట్టి పోలీసు అధికారులు ముఖేష్ చంద్రాకర్ హత్యలో ఎంతమంది పాల్గొని ఉంటారోనన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. అతన్ని చంపిన తీరును బట్టి ఈ హత్యలో ఇద్దరికన్నా ఎక్కువ మందే పాలు పంచుకుని ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవర్ ఇంట్లో…

జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్యతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకున్నట్టుగా తెలుస్తోంది. అతని కోసం ఆరా తీస్తున్న క్రమంలో 300 కాంటాక్ట్ నంబర్లను, 200 సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించాల్సి వచ్చిందని బీజాపూర్ పోలీసులు తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని అతని డ్రైవర్ ఇంట్లో సురేష్ చంద్రాకర్ షెల్టర్ తీసుకున్నాడని సాంకేతిక ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపున అతని కంకేర్ జిల్లాలో అతని భార్యను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

రక్షణ వలయం నుండి…

మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో ప్రభుత్వం కెటాయించిన నిధులతో అభివృద్ది పనులకు సంబంధించిన కాంట్రాక్టు పనులు చేస్తున్న సురేష్ చంద్రాకర్ జీవితం తలకిందులుగా అయింది. నక్సల్స్ నుండి ప్రాణహాని ఉంటుందన్న యోచనతో బస్తర్ రేంజ్ పోలీసు అధికారులు కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ కు భారీ ఎత్తున రక్షణ కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బలగాల రక్షణలో జీవనం సాగించిన కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్, జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ హత్యలో భాగస్వామ్యం ఉండడంతో పోలీసులు అతన్ని నిందితునిగా గుర్తించారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న కారణంతో సెక్యూరిటీ ఫోర్స్ నడుమ జీవనం సాగిస్తే… నేడు ఆయన నిందితునిగా అదే పోలీసుల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితికి దిగజారిపోయాడు. బస్తర్ ఏరియాలోనే బడా కాంట్రాక్టర్ గా పేరొందిన సురేష్ చంద్రాకర్ నేడు బేడీలు వేసిన చేతులతో తలదించుకుని నిలబడాల్సి వచ్చింది. జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ హత్యతో ఆయన బంగారు మయంగా ఉన్న ఆయన కటకటాలను లెక్కించాల్సి వస్తోంది

You cannot copy content of this page