నా భర్త షూట్ చేస్తుండగా శృంగార సన్నివేశాల్లో నటించాను: స్టార్ నటి

జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అత్యంత అద్భుత ప్రేమ కావ్యం ‘టైటానిక్’. ఈ సినిమాలో హీరోహీరోన్ల్‌గా నటించిన కేట్ విన్స్‌లేట్, లియోనార్డో‌ డికాప్రియో కెమిస్ట్రీ టైటానిక్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా టైటానిక్ స్పెషల్ షో వేశారు. దీనికి టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్‌లో పాటు, హీరో లియోనార్డో డికాప్రియా, హీరోయిన్ కేట్ విన్ స్లేట్ పాల్గొన్నారు.

ఈ క్రమంలో కేట్ మాట్లాడుతూ.. ‘‘టైటానిక్ సినిమా వచ్చిన 10 ఏళ్ల తర్వాత లియోనార్డో‌ డికాప్రియోతో ‘రెవల్యూషనరీ రోడ్’ అనే చిత్రంలో నటించాను. ఈ సినిమా 2008లో విడుదలవగా.. దీనిని డైరెక్షన్ నా భర్త సామ్ మెండిస్ చేశాడు. కాగా.. ఈ మూవీలో చాలా శృంగార సన్నివేశాలున్నాయి. అయితే నా భర్త ముందే ఆ సన్నివేశాలు చేయడానికి కాస్తా ఇబ్బంది పడేదాన్ని.. అలాగే కాస్తా కొత్తగా అనిపించేది’’ అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులతో పంచుకుంది కేట్ విన్ స్లేట్.

You cannot copy content of this page