దిశ దశ, హుజురాబాద్:
బహిరంగ వరస ఘటనలు సంచలనంగా మారిపోయాయి. కొద్ది రోజులుగా ఏర్పాటు చేస్తున్న అధికారులకు సంబంధించిన అంశాలే వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మ్యూటేషన్ విషయంలో గజ్వేల్ తహసీల్దార్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి తహసీల్దార్‌గా ఉన్న సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు అయింది. మరోవైపున వీణవంక తహసీల్దార్ తిరుమల్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అమెరికాలో పట్టాదారు ప్రత్యక్షంగా ఆమెతో సంబంధం లేకుండానే భూ విక్రయాలకు సంబంధించిన వ్యవహారంలో ధరణిలో పేరు మార్పిడి చేశారు. దీనితో ఆపరేటర్ పై నమ్మకం ఉంచి తాను తొందరపడి తిరుమల చేశానని బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రావు వీణవంక ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అంతకు ముందే వారికి ఓ గ్రామానికి చెందిన వారికి ఫ్యామిలీ మెంబర్టిఫికెట్ విషయంలో వీణవంకలో ఇచ్చిన సిబ్బందిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ధరణీ ఆపరేటర్ కూడా అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. వీణవకం తహసీల్దార్ చోటు చేసుకున్న పరిణామాలపై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. తాజాగా జమ్మికుంట తహసీల్దార్ రజినిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు బుధవరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల దాడులు జరిగాయి. బుధవారం వేకువ జామునే కెఎల్ఎన్ రెడ్డి కాలనీకి చేరుకున్న ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు తహసీల్దార్లపై వేటు పడడంతో కరీంనగర్ జిల్లా పక్కన ఆందోళనలు చోటుచేసుకున్నాయి. వరస ఘటనలతో కరీంనగర్ జిల్లా పరిధి అసలే జరుగుతోంది అన్న చర్చ కూడా మొదలైంది.
ఆఫీసులోనే రెస్ట్ రూం…
మరో వైపున జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఆఫీసులోనే ప్రత్యేకంగా రెస్ట్ రూం ఏర్పాటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇంతకు ముందు వరకు ఇన్స్ పెక్టర్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వాస్తవంగా తహసీల్దార్ హెడ్ క్వార్టర్ లోనే ప్రైవేట్ ఇళ్లు అద్దెకు తీసుకుని కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. కానీ రజని మాత్రం ప్రభుత్వమే రెస్ట్ రూం ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రిఫ్రెష్ మెంట్ కోసం కనీసం ఓ గదిని అద్దెకు తీసుకున్నా బావుండేది కానీ తహసీల్దార్లే ఓ గదిని వినియోగించడం ఏంటన్న ఆరోపణలు కూడా వచ్చాయి.