కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఫస్ట్ షాక్… ఈఎస్సీలపై వేటు… మంత్రి ఆదేశం

దిశ దశ, హైదరాబాద్:

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై చర్యలు తీసుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు ఈఎస్సీలపై వేటు వేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

ఒక్క మేడిగడ్డతోనే…

కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంపై విజిలెన్స్ విచారణ చేపట్టి రిపోర్టు ఇచ్చింది. ఈ ప్రాథమిక నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఈ విషయాన్ని పరిగణించినట్టుగా తెలుస్తోంది. నిర్మాణ సమయంలో ఇరిగేషన్ విభాగానికి చెందిన ఇంజనీర్లు నిర్మాణ కంపెనీకి అనుగుణంగా వ్యవహరించారని విజిలెన్స రిపోర్టులో పేర్కొంది. పూర్తయిన పనులకు రివైజ్డ్ ఎస్టిమేట్లు తయారు చేయడం, మేడిగడ్డ నిర్మాణ సమయంలో వ్యవహరించిన తీరుతో జరిగిన నష్టం తదితర అంశాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తొలి వేటు వేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని, రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లును సర్వీస్ నుండి తొలగించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధేశించారు. వీరితో పాటు మరికొంతమంది ఇరిగేషన్ ఇంజనీర్లపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 

You cannot copy content of this page