దిశ దశ, జాతీయం:
హైదరాబాద్ ఫార్మ్ హౌజ్ లో చిల్ అవుతున్న సినీ నటీ హేమ… ఇక్కడే బిర్యానీ చేస్తున్న బెంగుళూరులో పోలీసులు చేపట్టిన పరీక్షలో మాత్రం డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. హైదరాబాద్ లో ఉన్న ఆమె నుండి బెంగుళూరు పోలీసులు షాంపిల్స్ ఎలా తీసుకున్నారు..? డ్రగ్స్ పాజిటివ్ రిపోర్టు రావడం ఏంటీ అన్నదే సరికొత్త చర్చకు దారి తీస్తోంది. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని బెంగుళూరు శివార్లలో రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయడంతో భారీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో హిరో శ్రీకాంత్ కూడా ఉన్నట్టుగా ప్రచారం జరిగినప్పటికీ తాను ఆ పార్టీకి వెళ్లలేదని.. రేవ్ పార్టీలకు దూరంగా ఉంటానని శ్రీకాంత్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ముఖం కనిపించకుండా ఉన్న ఓ వ్యక్తి తన టీ షర్టును పైకి అనుకుంటూ వెళ్లడం… నుదుటి భాగాన్ని గమనించిన చాలా మంది కూడా టాలివుడ్ హిరో శ్రీకాంత్ అని అనుకున్నారు. అయితే శ్రీకాంత్ తనకు బెంగుళూరు రేవ్ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో నటి హేమ కూడా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేశారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తాను లేనని, హైదరాబాద్ ఫార్మ్ హౌజ్ లో ఉన్నానని తానిక్కడే చిల్ అవుతున్నానని కూడా స్పష్టం చేశారు. ముందు ఓ జర్నలిస్టుతో మాట్లాడుతున్నప్పుడు వీడియో తీసి తాను హైదరాబాద్ లో ఉన్న విషయంపై క్లారిటీ ఇష్తానని, చాలా కాల్స్ వస్తున్నాయంటూ ఆమె అదే వీడియోలో వెల్లడించారు. మరో వీడియోలో తాను బిర్యాని వండుకుంటున్నానని తప్పుడు ప్రచారం నమ్మవద్దని హితవు పలికినంత పని చేశారు. దీంతో బెంగుళూరు రేవ్ పార్టీలో అసలు హేమ లేదా కావాలనే ఆమెపై దుష్ప్రచారం చేశారా అన్న విషయంపై తర్జనభర్జనలు మొదలయ్యాయి. ఆ తరువాత బెంగుళూరు పోలీసు అధికారులు కూడా హేమ రేవ్ పార్టీలో ఉందని క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా కథనాలు వెలువడ్డాయి. తాజాగా రేవ్ పార్టీని భగ్నం చేసిన బెంగుళూరు పోలీసులు అక్కడ పట్టుబడ్డ వారందరి బ్లడ్ షాంపిల్స్ తీసి టెస్టులు చేయించారు. అయితే ఇందులో టాలివుడ్ నటీ హేమకు కూడా పాజిటివ్ వచ్చిందని బెంగుళూరు పోలీసులు వెల్లడించినట్టుగా కథనాలు వస్తున్నాయి. అయితే హేమ హైదరాబాద్ లో ఉన్నప్పుడు బెంగుళూరు పోలీసులు ఆమె బ్లడ్ షాంపిల్స్ ఎలా తీశారు..? రేవ్ పార్టీతో సంబంధం లేని ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా పాజిటివ్ రావడం ఏంటీ..? అన్నదే పజిల్ గా మారింది. అయితే హేమ కావాలనే రేవ్ పార్టీ అనంతరం బ్యాక్ గ్రౌండ్లో చెట్లు ఉండేవిధంగా చూసుకుని ఓ వీడియోను విడుదల చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే బెంగుళూరు పోలీసులు కూడా ఆమెను మందలించినట్టుగా వార్తలు వచ్చాయి. తాను లేనని సీన్ క్రియేట్ చేయబోయిన హేమ డ్రగ్స్ యూజ్ చేసినట్టుగా తేలడంతో ఇప్పుడేం సమాధానం చెప్తారోనన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.