నటి సౌందర్య భర్త ఛీటింగ్… మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని..

అల‌నాటి అందాల తార సౌంద‌ర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో త‌న అందం, చీర క‌ట్టుతో మెస్మరైజ్ చేసి లక్షల్లో అభిమానులను కూడగట్టుకుంది. ఈమె.. సెకండ్ స్క్రీన్ జూనియర్ సావిత్రిలా క‌నిపించడంతో అభిమానులు కూడా నేటితరం సావిత్రిగా పిలుచుకునేవారు. దాదాపుగా అందరు స్టార్ హీరోలతో ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్ సరసన రికార్డు స్థాయిలో హిట్ సినిమాల్లో నటించింది. వెండి తెర‌పై తిరుగులేని హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ త‌ర్వతా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ లో మ‌ర‌ణించి కోట్లాది మంది అభిమానులను శోక‌సంద్రంలో ముంచేసింది. ఆ విషాద ఘ‌ట‌న‌తో తెలుగు ఇండస్ట్రీ ఓ మంచి న‌టిని కొల్పోయింద‌ని చెప్పుకోవ‌చ్చు.

ఇదిలా ఉంటే.. సౌంద‌ర్య వ్యక్తి గ‌త జీవితానికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సౌంద‌ర్య చ‌నిపోయిన నాటికి ఆమెకు వివాహం అయిన విష‌యం తెలిసిందే. ఆమె చిన్న నాటి స్నేహితుడైన ర‌ఘుని ప్రేమ వివాహం చేసుకుంది. సాంప్రాదాయ బద్దంగానే సౌందర్య, రఘుల వివాహం జరిగింది. వీరి దాంప‌త్య జీవితం 5 ఏళ్లు సాగిన‌ప్పటికీ వీరికి పిల్లలు క‌లుగ లేదు. సౌంద‌ర్య త‌న న‌టించిన సంపాందిన డ‌బ్బులు, ఆస్తులు సైతం ర‌ఘు పేరిట బదిలీ చేసింది. అనూహ్యంగా తెలంగాణలోని కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక నుండి వచ్చే ప్రయత్నంలో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కావడంతో ఆమె చనిపోయింది. సౌంద‌ర్య చ‌నిపోయిన త‌ర్వాత ఆమె భర్త ఆ ఆస్తులను అనుభ‌విస్తూ అపూర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని గోవాలో సెటిల్ అయ్యాడు. అంతే కాకుండా సౌంద‌ర్య సంపాదించిన ఆస్తుల్లో ఆమె త‌ల్లిదండ్రుల‌కు చెందాల్సిన‌వి కూడా ఇవ్వకుండా వారిని రోడ్డున పడేసిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. తమకు అన్యాయం జరిగిందని సౌంద‌ర్య త‌ల్లిదండ్రులు కేసు పెట్టగా వారికి అనుకూలంగా తీర్పు రావ‌డంతో ర‌ఘు వాళ్లకు చెందాల్సిన ఆస్తులు ఇస్తానంటూ ఒప్పుకున్నాడు. అయితే ఏదో నామమాత్రంగా ఇచ్చాడే త‌ప్ప పూర్తి ఆస్తులు ఇంకా ఇవ్వలేదంటూ ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి.

You cannot copy content of this page