కౌశిక్ రెడ్డికి షాకిస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధులు… ఒకే రోజు రెండు ఘటనలు…

దిశ దశ, హుజురాబాద్:

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో ప్రతికూల వాతావరణం ఎదురవుతోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల రూపంలో ఆయనకు ధిక్కార స్వరం వినిపిస్తో్ంది. ఒకే రోజు జరిగిన రెండు ఘటనలే ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పవచ్చు. బుధవారం  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గ్రామ పంచాయితీ భవనాల ప్రారంభోత్స కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరు కావల్సి ఉన్నప్పటికీ వేళకు సర్పంచులు పంచాయితీ భవనాలను ప్రారంభించేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కౌశిక్ రెడ్డి కార్యదర్శిని మందలించారు. ఆ తరువాత ఇతర పంచాయతీలను ప్రారంభించేందుకు వెల్లిపోయారు.

జమ్మికుంటలో ఇలా… 

అవిశ్వాస రాజకీయాలకు చెక్ పెట్టి తన పంథాను నెగ్గించుకున్న కౌశిక్ రెడ్డికి రెండు రోజుల్లోనే కౌన్సిలర్లు రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బుధవారం జమ్మికుంట మునిసిపాలిటికి చెందిన 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు  ప్రకటించారు. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తం అయ్యారు. దీంతో ఒకే రోజు రెండు చోట్ల కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ప్రతికూలత ఎదరైనట్టయింది. 

You cannot copy content of this page