జడ్జిగా నియమిస్తారా…

ఐదేళ్ల క్రితం ఆయనను జడ్జిగా నియమిస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఇప్పటికీ ఆయనను నియామకానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత ప్రదర్శించడం లేదు. ఇప్పటికి మూడు సార్లు పంపిన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ఐదేళ్లుగా ఆ అడ్వకేట్ జడ్జి అవుతాడా దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారా అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్…

ఎవరాయన..

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ ను ఢిల్లీ కోర్టు జడ్జిగా నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ ఓ కారణంగా ఆయన నియామక ప్రక్రియను హోల్డ్ లో పెట్టేసింది. సౌరభ్ కిర్పాల్ ‘గే’ అయినప్పటికీ ఆయన్ని జడ్జిగా నియమించాలని కొలిజియం నిర్ణయం తీసుకుంది. కిర్పాల్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఓకె చెప్తే మాత్రం న్యాయవ్యవస్థలో జడ్జిగా నియామకం అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. స్వలింగ సంపర్కుడిని బెంచ్ లో నియమిస్తుందని అనుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీం చీఫ్ గా ఉన్న ఎన్ వి రమణ హయాంలోనే కిర్పాల్ ను ఢిల్లీ హై కోర్టు జడ్జిగా నియమించాలన్న ప్రతిపాదనలను కొలిజియం చేసింది. అయితే ఈ విషయంలో కేంద్రం వైఖరిని సుప్రీం కోర్టు కూడా తప్పు పడుతోంది. కొలీజియ చేసిన సిఫార్సులను నిలిపివేసే పద్దతిని స్వీకరించబోమని సుప్రీం స్పష్టం చేసింది. కొలిజియం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో కిర్పాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

You cannot copy content of this page