క్షణికావేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు అనడానికి కర్నూల్లో జరిగిన సంఘటనే నిదర్శనం. కొత్తగా పెళ్లై ఎంతో సంతోషంగా ఉండాల్సిన జంట, చిన్న విషయాలకే గొడవపడి మర్డర్ చేసేదాక వచ్చింది.
పెళ్లై 14 రోజులు కూడా గడవకముందే, నవ దంపతుల మధ్య ప్రేమ కంటే ద్వేషం మొదలైంది. చిన్న గా మొదలైన గొడవ చంపుకునేంత వరకు వెళ్లింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లితే.. కర్నూల్ జిల్లాకు చెందిన శ్రావణ్ అనే వ్యక్తి, తెలంగాణలోని వనసర్తికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి పెళ్లై 14 రోజులు అవుతుంది. 10 రోజులు కలిసి సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్న గొడవలు కాస్త, పెద్దగా మారాయి. యువతి తల్లిదండ్రులు కూతురును చూసి పోవడానికి కర్నూల్ వచ్చారు. దీంతో వీరు వచ్చిన ఒక రోజుకు ముందే నవదంపతుల మధ్య గొడవ జరిగింది. ఇక అత్తమామ, వచ్చిన రోజు కూడా శ్రావణ్, తన భార్యతో మల్లీ గొడవ పెట్టుకున్నాడు. ఇక యువతి తల్లిదండ్రులను నచ్చజెప్పింది. కానీ మల్లీ శ్రావణ్ పెద్ద ఎత్తున గొడవ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన శ్రావన్ తన భార్యను కూరగాయలు కోసే కత్తితో దారుణంగా హత్య చేశాడు. అలాగే అడ్డు వచ్చిన అత్త మామలపై కూడా దాడి చేయడంతో యువతి తల్లి దండ్రులకు తీవ్రగాయాలు అయ్యాయి.
దీంతో గొడవ జరగడంతో గట్టిగా కేకలు వేయడంతో ఇంటి ఓనర్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యువకుడిపై కేసు నమోదు చేసుకొని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఈ ఘటన కర్నూల్ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. పెళ్లయిన రెండు వారాలతో చంపుకునేంత గొడవలు ఏం జరిగి ఉంటాయా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.