దారుణానికి పాల్పడ్డ అత్తింటి వారు.. గర్భిణీని హత్య చేసిన కుటుంబం?

వరకట్నం వేధింపులు, లింగనిర్థారన వంటి సమస్యలతో మన సమాజంలో ఆత్మహత్యలు.. హత్యలు జరిగేవి. ప్రభుత్వం ఇలాంటి విషయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కొత్త చట్టలు తేవడం, శిక్షలు వేయడంతో అవి తగ్గుముఖం పట్టాయి. కానీ.. ఇప్పటికీ పలు చోట్ల మహిళలు ఇంకా ఇలాంటి విషయాల్లో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కట్నం తేలేదని వేధించడమే కాకుండా కడుపులో ఆడ బిడ్డ ఉన్నదని తెలిసి అత్తింటి వారు కోడలిని హింసించారు. ఈ క్రమంలోనే ఆ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిచింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

చిక్కబళ్లాపురం జిల్లాలోని జంగమసీగేహల్లి గ్రామానికి చెందిన తనుశ్రీ, బెంగళూరు రూరల్ జిల్లా ఆచార్లహళ్లికి చెందిన నవీన్ కుమార్ తో వివాహం జరిగింది. మొబైల్ షాప్ రన్ చేస్తున్న నవీన్ కు పెళ్లి సమయంలో తనుశ్రీ కుటుంబ సభ్యులు భారీగా కట్నకానుకలు ఇతర లాంఛనాలు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయిన మొదట్లో బాగానే ఉన్న భర్త.. ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని బయట పెట్టాడు. భర్తతో కలిసి అత్తింటి వారు కూడా అదనపు కట్నం కోసం తనుశ్రీని వేధించేవారు. వీరి వేధింపులు తట్టుకోలేక తనుశ్రీ ఫిబ్రవరి 9న తన పుట్టింటికి వెళ్లి రూ.1.20 లక్షలు తెచ్చింది. తర్వాత ఒంట్లో బాగలేక ఆసుపత్రిలో చూపించుకోవడంతో గర్భం దాల్చినట్టు డాక్టర్లు చెప్పారు. దీంతో ఎంతో సంబుర పడిపోయిన తను శ్రీ తన కడుపున పెరుగుతున్న బిడ్డ కోసం అత్తింటి వేధింపులు సైతం తట్టుకునేది. ఈ క్రమంలోనే మరోసారి తన హెల్త్ బాగోకపోవడంతో ఆసుపత్రిలో టెస్ట్‌లు చేయించుకుంది. ఆ రిపోర్ట్స్‌లో తనుశ్రీ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని అత్తింటి వారు ఆ యువతికి అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తర్వాత తనుశ్రీ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయం గమనించిన స్థానికులు తనుశ్రీ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తన బిడ్డను అత్తింటి వారే చంపేశారని తనుశ్రీ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తనుశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా.. తనుశ్రీ మరణాంతరం ఆమె అత్తింటి వారు.. భర్త, అత్త, మరిది ఇంటి నుండి పరారయ్యారు.

You cannot copy content of this page