మళ్లీ మొదలైన దళిత బంధు ఆందోళన

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లాలో మళ్లీ దళిత బంధు కోసం ఆందళనలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. మోడల్ నియోజకవర్గంగా ఎంపికైన హుజురాబాద్ కు చెందిన లబ్దిదారులే మళ్లీ నిరసనలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో దళిత బంధు స్కీం అందరికీ అందలేదంటూ కరీంనగర్ కలెక్టరేట్ కు వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ దళిత ఐద్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళితులు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. మొదటి విడుతలోనే ఇంకా 15 మందికి రావల్సి ఉండగా, రెండో విడుతలో 5 వేల మంది అర్హులు ఉన్నారని వారు వివరించారు. అయితే తమకు దళిత బంధు ఇవ్వాలని అధికారులను కోరితే రేషన్ కార్డులు కావాలని అధికారులు అడుతున్నారని అంటున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో తాము ఉమ్మడి కుటుంబంగా రికార్డుల్లో చూపించుకోవల్సి వచ్చిందని వారు వివరించారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోెవడం వల్ల తాము అనర్హులమని పేర్కొంటున్న తీరు సరికాదన్నారు. తాము పెళ్లిల్లు చేసుకుని వేరే కాపురం ఉంటున్నప్పటికీ రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, ఇప్పుడు అధికారులు రేషన్ కార్డులు బూచి చూపెడతూ తమకు అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు దళిత బంధు ద్వారా ఆర్థిక సాయం అందించాలని లేనట్టయితే ఆందోళణ మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. 

You cannot copy content of this page