ఈ అఘౌరీని తీసుకోం… జైలు అధికారుల స్పష్టం…

దిశ దశ, సంగారెడ్డి:

ట్విస్టుల మీద ట్విస్టులతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అఘౌరీ శ్రీనివాస్ మరోసారి రచ్చరచ్చ చేశారు. ఛీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అఘెరీ శ్రీనివాస్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో మోకిలా పోలీసులు సంగారెడ్డి కంది జైలుకు తరలించారు. అయితే కంది జైలుకు తరలించిన తరువాత తనతో పాటు వర్షిణీని కూడా ఉంచాలని పట్టుబట్టిన శ్రీనివాస్ పోలీసులను ఇబ్బందికి గురి చేశారు. గట్టిగా అరుస్తూ వర్షిణీని తనతో పాటు ఉంచాలని కంది జైలులో హంగామా సృష్టించారు. ఓ వైపున శ్రీనివాస్ చేసిన గొడవతో ఇబ్బంది పడుతున్న క్రమంలోనే జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ట్రాన్స్ జండర్ ఫీమెల్ గా పేర్కొనడంతో శ్రీనివాస్ ను తమ జైలులో తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి జైలులో మహిళలు, పురుషులకు మాత్రమే ప్రత్యేకంగా బ్యారక్ లు ఉన్నాయని, ట్రాన్స్ జెండర్లకు లేవని చెప్పడంతో శ్రీనివాస్ స్త్రీ జాతికి చెందిన వారా, పురుష జాతికి చెందిన వారా,  ట్రాన్స్ జెండరా అన్న విషయం తెలుసుకోవల్సిన పరిస్థితి ఎదురయింది మోకిలా పోలీసులకు. దీంతో శ్రీనివాస్ ను చేవెళ్ల ఆసుపత్రికి తరలించి ఏ లింగమో నిర్దారించాలని వైద్యులను కోరాలని  నిర్ణయంచారు. ఒక వేళ వైద్యులు ట్రాన్స్ జెండర్ గా గుర్తించినట్టయితే శ్రీనివాస్ ను చంచల్ గూడ జైలుకు తరలించాల్సి ఉంటుంది. చంచల్ గూడ జైలులో మాత్రమే ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా బ్యారక్ లు ఉన్నాయి. వైద్యులు శ్రీనివాస్ ఏ లింగానికి చెందిన వారోనన్న విషయంపై స్పష్టత ఇచ్చిన తరువాత మోకిలా పోలీసులు ఏ జైలుకు తరలించాలోనన్న విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page