అక్కడ సెల్యూట్… ఇక్కడ డుమ్మా…

ఎర్రకోట వద్ద కనిపించని ఖర్గే…

చర్చనీయాంశంగా మారిన అంశం

దిశ దశ, న్యూ ఢిల్లీ:

స్వాతంత్ర్య అమృతోత్సవాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వైవిద్యమై నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ సారి ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలకు దూరంగా ఉన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఆయన ఎర్రకోటకు మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే అనారోగ్య కారణాల వల్లే ఎర్రకోట కార్యక్రమానికి హాజరు కాలేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం… దేశ అభ్యున్నతికి కోసం ఇప్పటి వరకు పని చేసిన ప్రధానులు కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. వాజ్ పేయితో పేరును కూడా తన ప్రసంగంలో ప్రస్తావించిన ఖర్గే ప్రధాని మోడీ వ్యవహరశైలిని పరోక్షంటగా తప్పు పట్టారు. దేశ స్వాతంత్ర్య సమయం నుండి చేపట్టిన అనేక అభివృద్ది ఫలాలన్ని కూడా గత ప్రధానుల ఆలోచనల నుండి పుట్టుకొచ్చాయన్నారు. ప్రస్తుతం కొందరు అభివృద్ది తమ వల్లే అని గొప్పలు చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. అయితే ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేసిన తరువాత ప్రధాని ప్రసంగ కార్యక్రమానికి ప్రముఖులంతా హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి మాత్రం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారగా, ఆయనకు ప్రత్యేకంగా కెటాయించిన సీటు ఖాలీగా ఉన్న ఫోటోతో పాటు ఏఐసీసీ కార్యాలయంలో పాల్గొన్న ఫోటో వైరల్ అవుతున్నాయి.

You cannot copy content of this page