మరోసారి చర్చల్లోకి వచ్చిన విషయం
దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతలో మావోయిస్టుల ఏరివేత కోసం బలగాలు ఏరియల్ దాడులు కొనసాగిస్తున్నాయని, ఈ దాడుల వల్ల సామన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని దక్షిన బస్తర్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమతా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. పామేడ్ పోలీస్ స్టేషన్ నుండి శుక్రవారం ఉదయం 6 గంటల నుండి భట్టిగూడ, కావురుగట్ట, మీనగట్ట, జబ్బగట్ట గ్రామాలపై డ్రోన్, హెలిక్యాప్టర్ దాడులు జరిగాయని ఆరోపించారు. ఆయా గ్రామాల అటవీ ప్రాంతాలు, పొలాలు, గుట్టలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల సాయంతో బాంబులు వేస్తూ, హెలిక్యాప్టర్ ద్వారా ఫైరింగ్ చేశారన్నారు. ఇప్పపూలు ఏరుకునేందుకు సమాయత్తం అయిన సామాన్య జనం ఒక్కసారిగా ఆకాశం నుండి బాంబులు, ఫైరింగ్ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారని సబిత తెలిపారు. మార్చి 25న బస్తర్ అటవీ ప్రాంతంలో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేయాలని, నక్సల్స్ అణిచివేసేందుకు కేంద్ర బలగాలకు అవసరమైన మోటివేషన్ చేశారని సబిత ఆరోపించారు. అమిత్ షా పర్యటన తరువాత ఇన్ ఫార్మర్ ల ద్వారా సమాచారం సేకరిస్తూ నిరంతరం డ్రోన్లు, హెలిక్యాప్టర్ల సాయంతో ప్రజలపై దాడులకు పూనుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం జరిగిన దాడి అని, ఈ అటవీ ప్రాంతంలోని సహజ వనరులను సామ్రాజ్యవాదులకు దారదత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడానికి ప్రజా యుద్దంగా ఆటంకంగా మారిందన్నారు. వనరులను దళారీ నిరంకుశ పెట్టుబడి దారులకు చేరవేయాలంటే ప్రజా పోరాటాలు, యుద్దాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. దండకారణ్య ప్రాంత ప్రజలు తమ అస్థిత్వం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నారని, వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలునిచ్చారు. రాజ్యంగా వ్యతిరేకంగా సాగుతున్న డ్రోన్స్, వైమానిక దాడులను ఖండిచాలని దక్షిణ బస్తర్ అధికార ప్రతినిది సమత కోరారు.