పది సెకన్ల గడిస్తే పదిలం అంతలోనే ప్రమాదం…

మరి కొద్దిసేపట్లో టేక్ ఆఫ్ కాబోతున్న ఫ్లైట్ దిగి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని అనుకుంటున్నారు. ఫ్లైట్ ల్యాండ్ కాగానే అనుకున్న చోటకు ఎలా చేరుకోవాలో ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు మరికొందరు. పట్టుమని పది సెకన్లు గడిస్తే వారంతా సేఫ్ గా ల్యాండ్ అయ్యే వారు. క్షణాల్లో భూమిపై చేరుకోవల్సిన వారి ప్రాణాలన్ని గాలిలో కలిసిపోయాయి. ఎయిర్ జర్నీ చేస్తున్న ఆ ప్రయాణీకుల ఆయువు అనంతవాయువులో కలిసిపోయింది. నేపాల్ లో జరిగిన ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. సంఘాటనా వివరాల్లోకి వెల్తే… నేపాల్ దేశ రాజధాని ఖాట్మాండు నుండి కాస్కీ జిల్లాలోని పోఖారాకు బయలుదేరిన ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. పొఖారాకు వెళుతున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో అదుపుతప్పి సేతు నది ఒడ్డున ఉన్న లోయలో కుప్పకూలింది. ఇందులో 68 మంది ప్రయాణీకులు కాగా నలుగురు విమాన సిబ్బందిగా ఉన్నట్టుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని విమానయాన వర్గాలు తెలిపాయి. ఇందులో్ నేపాల్ కు చెందిన వారు 53, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒక ఐరిష్, ఇద్దరు కొరియన్లు, అర్జెంటీనాకు చెందిన ప్రయాణికులు ఒకరు ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి పొఖారా సమీపంలో కుప్పకూలీన ఈ విమాన ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని వారు ప్రకటించారు. పోఖారాలో కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విమానాశ్రయానికి, పూర్వ విమానాశ్రయానికి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సంభవించిన వెంటనే ఘటన స్థలంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుందని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్టు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలం నుండి మృతదేహాలను వెలికి తీసే పనులు కూడా చేపట్టినట్టు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తెక్ బహదూర్ కేసీ మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు 16 డెడ్ బాడీస్ ను ఘటన స్థలం నుండి బయటకు తీశారు. విమానంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని వ్యాఖ్యానించారు. విమానం కూలిపోవడంతో పోఖారా ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఫ్లైట్ ఆక్సిడెంట్ పై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసి ఆయా శాఖాల అధికారులు ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేపాల్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారతదేశ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంతాపం వెలిబుచ్చారు.

You cannot copy content of this page