సుడాకు లేఖ రాసిన ఇరిగేషన్… నోటీసులు ఇచ్చిన సుడా…

నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోరా..?

దిశ దశ, కరీంనగర్:

లెటర్లు ఇచ్చాం చేతులు దులుపుకున్నామని అధికారులు చెప్తున్న తీరుకు ప్రత్యక్ష్య ఉదాహారణగా చెప్పవచ్చు ఈ ఘటన. భారీ వెంచర్ స్టార్ట్ చేయాలని తలచిన రియల్ ఏస్టేట్ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్తున్నారు కానీ పర్మిషన్లు రద్దు ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది.  అంతేకాకుండాా ఈ సైట్ లో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. కరీంనగర్ సమీపంలోని నగునూరులో అక్షర టౌన్ షిప్ విషయంలో ఆయా శాఖలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. తాము వెంచర్ పై సుడాకు లేఖ రాశామని, రియల్ సంస్థ నిభందనలకు విరుద్దంగా వ్యవహరించిందని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నగునూరు సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు, ఇరిగేషన్ డివిజన్ 5 ఈఈ పంపిన లేఖను అనుసరించి ఛైర్మన్ పేరాల శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసు జారీ శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) పేర్కొంది. సుడా అధికారులు ఈ వెంచర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు కూడా విస్మయానికి గురి చేస్తోంది. నగునూరు సర్పంచ్ 2021 సెప్టెంబర్ 3న ఫిర్యాదు చేయగా, ఇరిగేషన్ ఈఈ సెప్టెంబర్ 22న లేఖ రాయగా సుడా మాత్రం అక్టోబర్ 12న షోకాజ్ నోటీసులు ఇవ్వడం గమనార్హం. పంచాయితీ సర్పంచ్ ఫిర్యాదు చేసిన నెల రోజుల తరువాత, ఇరిగేషన్ ఈఈ అధికారింగా లేఖ రాసిన 20 రోజుల వరకూ సుడా వెంచర్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇవ్వకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఆ తర్వాత 2022 జులై 1న మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చింది సుడా.  ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారికంగా పంపిన లేఖలపైనే సుడా స్పందించిన తీరు వింతగా తయారైంది. 

భారీ కమాన్ నిర్మాణం…

ఇకపోతే అటు సుడా, ఇటు ఇరిగేషన్ అధికారులు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా వ్యవహారాన్ని చక్కదిద్దినప్పటికీ అక్షర టౌన్ షిప్ లో మాత్రం నిర్మాణాలు జరుగుతుండడం విస్మయం కల్గుతోంది. వెంచర్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద బారీ స్థాయిలో స్వాగత తోరణం నిర్మిస్తుండగా వెంచర్ లో రోడ్డుకు ఇరువైపులా నిర్మాణ సామాగ్రిని వేసి ఉంచారు. వెనక ప్రాంతంలో కూడా జేసీబీలతో పనులు చేస్తున్నారు. నాలా కన్వర్షన్ చేసుకున్నప్పటికీ సుడా షోకాజ్ ఇచ్చిన తరువాత కూడా నిర్మాణాలు ఎలా జరుపుతున్నారన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఈ వెంచర్ కు మెయిన్ రోడ్డుగా చూపిస్తున్న రహదారి ఎస్సారెస్పీ కెనాల్ కోసం నిర్మించినది. దీనిని వ్యవసాయ అవసరాలకు రైతులు, కాలువల పర్యవేక్షణకు ఇరిగేషన్ అధికారులు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కమర్షియ్ అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోడ్డును వాడుకునేందుకు నిబంధనలు అనుకూలించవు. అయితే అక్షర టౌన్ షిప్ నిర్వాహకులు మాత్రం వెంచర్ లో నిర్మాణాలు జరుపుతున్న తీరు మాత్రం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. భారీ సైజులో నిర్మిస్తున్న స్వాగత తోరణాన్ని గమనిస్తే మాత్రం ప్లాట్ల విక్రయానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టౌన్ షిప్ నిర్వహాకులు నాలా కన్వర్షన్ అనుమతులు తీసుకున్నప్పటి్కీ ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా సంబంధిత గ్రామ పంచాయితీ నుండి అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. కానీ అనుమతులు కోరుతూ పంచాయితీలకు ఎలాంటి దరకాస్తులు అందలేదని తెలుస్తోంది.

వెన్నుదన్ను ఎవరో…?

అక్షర టౌన్ షిప్ విషయంలో అప్పటి ప్రభుత్వానికి చెందిన కొంతమంది పెద్దల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన కీలక నేతల జోక్యంతో అధికార యంత్రాంగం పట్టించుకోని వైఖరి అవలంభించిందన్న ప్రచారం జరిగింది. రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సుడా అధికారులు లే ఔట్ పర్మిషన్ ఎందుకు రద్దు చేయలేదన్నదే మిస్టరీగా మారింది. మెదటి నోటీసు ఇచ్చిన నెలలకు  రెండో నోటీసు ఇవ్వడానికి కారణం ఏంటో సుడాకే తెలియాలి.  రెండో సారీ నోటీసు ఇచ్చి 8 నెలల కావస్తున్నా నిభందనల ప్రకారం చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్న విషయంపై చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం మారిన తరువాత కూడా ఈ వెంచర్ విషయంలో పట్టించుకోని వైఖరి అవలంభిస్తుండడమే పజిల్ గా మారింది.

You cannot copy content of this page