టెలికాం సంస్థలన్ని కొత్త సంవత్సరంలో మరింత జోరు పెంచుతున్నాయి. కస్టమర్లను పెంచుకునేందుకు అనేక కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షనీయంగా ఉండే ప్లాన్లను కొత్తగా అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్లాన్లను ప్రవేశపెట్టగా.. తాజాగా మరో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కొత్తగా రెండు ప్లాన్స్ ను వినియోగదారుల కోసం తెచ్చింది.
ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రెండు కొత్త ప్రీపెయడ్ ప్లాన్లను ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. కొత్తగా రూ.489, రూ.509 ప్లాన్లను ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. రూ,489 ప్లాన్ విషయానికొస్తే.. ఇది 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు నెలకు 50 జీబీ డేటా వస్తుంది. నెలకు 300 ఎస్‌ఎమ్మెఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ కు అదనంగా ఉచిత వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ వ్తుంది. అలాగే ఉచిత హలోట్యూన్ తో పాటు, అపోలో 24/7 సర్కిల్, ఫాస్ట్‌గ్ పై క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ఉన్నాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది.
ఇక రూ.509 ప్లాన్ విషయానికొస్తే. .ఇది కూడా 30 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. ఇక 60 జీబీ డేటాతో పాటు నెలకు 300 ఎస్సెమ్మెస్ లు ఉచితంగా పంపించుకోవచ్చు. ఇక ఉచిత హలో ట్యూన్, అపోలో 24-7, ఫాస్టాగ్‌పై క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ఉన్నాయి. ఇక వింత్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది.
అయితే ఎయిర్ టెల్ ఇటీవల బేసిక్ ప్లాన్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బేసిక్ రీఛార్జ్ ప్లాన్ ధరను 57 శాతం పెంచి రూ.155కు పెంచింది. రూ.155 ప్లాన్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్ తో పాటు 1 జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి.