సమాజ హితం కోసం మహిళలను గౌరవించుకోవాలి: ఆర్డీఓ మహేశ్వర్

దిశ దశ, కరీంనగర్:

ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం మహిళలను గౌరవించుకోవల్సిన అవసరం ఉందని కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మహేశ్వర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గురువారం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని ఘనంగా సత్కరించారు. ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్ మాట్లాడుతూ… అన్ని రంగాల్లోనూ మహిళలు ఎదుగుతున్నప్పటికీ వివక్షత చూపిస్తున్న తీరు మరింత తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులకు ప్రత్యేక గౌరవం ఇస్తామని, గతంలో కూడా ఈ సాంప్రాదాయం కొనసాగేదన్నారు. ప్రతి 15 ఆగస్టు, 26 జనవరి సందర్బంగా కళాకారులను సత్కరించి గౌరవించుకునే సంప్రాదాయం కూడా ఉండేదన్నారు. జాతి సంపద అయినటువంటు కళామతల్లి ముద్దు బిడ్డలకు అన్నింటా ప్రాధాన్యత కల్పించే విధంగా చొరవ తీసుకుంటానని ఆర్డీఓ మహేశ్వర్ అన్నారు. ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవి చంద్ర మాట్లాడుతూ… కళాభారతి మూగబోవడంతో కరీంనగర్ లో కలలకు ఆదరణ లేకుండా పోయిందన్నారు. కరీంనగర్ కళా రంగానికి గత వైభవం సంతరించుకోవాలంటే కళాభారతిని వినియోగంలోకి తీసుకరావల్సిన అవసరం ఉందన్నారు. కాలమిస్ట్ బుర్ర మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ… మహిళలను గౌరవించుకునే సాంప్రాదాయం మరింత పెరిగాల్సిన అవసరం ఉందని, వివక్ష లేకుండా వారిని ఆదరించినప్పుడే సమాజం కూడా అభ్యున్నతి వైపునకు సాగిపోతుందున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జి కృపాదానం, ఊకంటి సంపత్, గోగుల ప్రసాద్ బాబు, వారాల ఆనంద్, ఆకుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు. కళాకారులు తమ పాటలతో ఊర్రూతలూగించారు. మ్యూజికల్ గ్రూప్ అధినేత ప్రవీణ్ సల్వాజి, సల్వాజి సంధ్యలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

You cannot copy content of this page