టాటా కంపెనీకే ఝలక్ ఇచ్చిన క్యాటరింగ్ వాలా… కేసు నమోదు చేసిన పుణే పోలీసులు…

దిశ దశ, జాతీయం:

నా ఏజెన్సీ కాంట్రాక్టు రద్దు చేస్తారా అయితే మీ అంతు చూడాల్సిందే అనుకున్నాడా క్యాటరింగ్ కాంట్రాక్టర్. అనుకున్నదే తడవుగా కంపెనీ క్యాంటీన్ తో ఒఫ్పందం చేసుకున్న కొత్త క్యాటరింగ్ ఏజెన్సీలోకి కోవర్టులుగా తన వాళ్లను  ఉద్యోగులగా పంపించాడు. వీరితో ఏకంగా టాటా మోటార్స్ కంపెనీ ఉద్యోగులకు చుక్కలు చూపించాడు. ఫుడ్ క్వాలి టీలో కాంప్రమైజ్ కావడంలో ఏ మాత్రం వెనకడని తమ కంపెనీ క్యాంటిన్ లో దొరికే సమోసాలు ఇలా సరఫరా కావడం ఏంటని చర్చించుకున్నారు ఉద్యోగులు. చివరకు మేనేజ్ మెంట్ కు తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  గుట్టు రట్టయింది. మహారాష్ట్రలోని పుణే నగరంలోని టాటా మెటార్స్ కంపెనీ క్యాంటిన్ కు కొంతకాలంగా ఓ క్యాటరింగ్ ఏజెన్సీ కాంట్రాక్టు పద్దతిలో సమోసాలతో పాటు ఇతర ఫుడ్ ఐటెమ్స్ సరఫరా చేసేది. అయితే ఇటీవల సదరు క్యాటరింగ్ ఏజెన్సీకి ఇచ్చిన కాంట్రాక్టును టాటా మోటార్స్ కంపెనీ వారు రద్దు చేసుకుని మరో ఏజెన్సీకి అప్పగించారు. అయితే తన కాంట్రాక్టును రద్దు చేశారన్న అక్కసుతో పాత క్యాటరింగ్ వాలా కొత్తగా కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీలో తన మనుషులను ఉద్యోగులుగా పంపించాడు. వారిని కోవర్టులుగా ఏర్పాటు చేసుకుని టాటా మోటార్స్ క్యాంటిన్ కు పంపించే సమోసాల్లో కండోమ్స్, రాళ్లు పెట్టి సరఫరా చేసేలా ప్లాన్ చేశాడు. కాంట్రాక్టర్ వేసిన స్కెచ్ బాగానే వర్కౌట్ అయినప్పటికీ క్యాంటిన్ ఉద్యోగులు మేనేజ్ మెంట్ కు కంప్లైంట్ చేచడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. టాటా మెటార్స్ నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పుణే పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు గుట్టు రట్టయింది. దీంతో పాత కాంట్రాక్టు ఏజెన్సీ యజమానితో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

You cannot copy content of this page