దిశ దశ, ఆదిలాబాద్:
తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కెటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంద్రవెల్లి స్ధూపం కోసం ఎకరం భూమిని కెటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మెమో నంబర్ 29158/Lan d Admin .I (1) 2023-1 ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి స్థూపం వద్ద సుందరీకరణ కోసం ఎకరం భూమిని కెటాయించాలని నిర్ణయించింది. ఇంద్రవెల్లి బి గ్రామంలోని సర్వే నెంబర్ 240లోని ఈ స్థలాన్ని కెటాయించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.