కేకేతో పాటు ఐకే కూడా..?

దిశ దశ, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కెశవరావుతో పాటు మరికొంతమంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీప్ దాష్ మున్షీ ఇటీవల కేకే ఇంటికి వెల్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి వివరించేందుకు ఎర్రవెల్లి ఫాంహౌజ్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కేకే గురువారం వెల్లి కలిశారు. తాను పార్టీ మారబోతున్న విషయం కూడా కేసీఆర్ కు వివరించిన ఆయన నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు కే కెశవరావుతో పాటు ఆయన తనయ, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ మరో 10 మంది కార్పోరేటర్లు మాత్రమే జాయిన్ అవుతున్నారని భావించారంతా. తాజాగా కేకేతో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ లు ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కేకేతో పాటు ఐకె రెడ్డి, అరవింద్ లు కూడా జాయిన్ కానున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page