జపాన్ లో ఆవుపేడతో వినూత్న పరిశోధనలు…రాకెట్ ఇంజన్ ప్రయోగం సక్సెస్…

దిశ దశ, అంతర్జాతీయం:

భారతీయులు పూజించే గోమాత విలువను జపనీయులు గుర్తించారు. అక్కడి శాస్త్రవేత్తలు నిత్యం ఏదో పరిశోధనల్లో నిమగ్నం అయి వాటిని సఫలం చేసే దిశలోనే ముందుకు సాగుతుంటారు. తాజాగా జపాన్ లో చేపట్టిన పరిశోధనల తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయంగా గోవు యొక్క గొప్పతనాన్ని మరోసారి రుజువు చేశారు జపాన్ శాస్త్ర వేత్తలు. ఇప్పటికే కార్లను ఆవుపేడతో నడిచే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. మారుతి సుజుకీ కంపెనీ జపాన్ కు చెందిన ఓ డైరీ కంపెనీతో కూడా అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా రాకెట్ ఇంజిన్ ను ప్రయోగించిన జపాన్ మరో అడుగు ముందుకు వేసింది. అవుపేడ నుండి లిక్విడ్ బయో మిథేన్ (LBM)తో రాకెట్ ఇంజన్ ను జపాన్ శాస్త్రవేత్తలు విజయవంతంగా నడిపించారు. స్పేస్ స్టార్టప్ ఇంటర్ స్టెల్లార్ టెక్నాలజీస్ ఇంక్ (IST) తరుచూ ప్రయోగాలు చేపట్టి సఫలం అయింది. హొకైడోలోని హోక్సైడో స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ లో ఆ ప్రయోగాలను నిర్వహించింది. ఈ ప్రయోగంలో జీరో లాంఛ్ వెహికిల్ రాకెట్ కు స్టాటిక్ పైర్ టెస్టులను చేయగా జీరో ఇంజన్ నుండి 10 సెకన్ల పాటు నీలం, నారింజ రంగుల్లో జ్వాలను విడుదల చేసింది. అక్కడి డెయిరీ సంస్థల నుండి సేకరించిన పేడ ద్వారా బయో మిథేన్ ను పొందామని ఐఎస్టీ పరిశోధకులు వెల్లడించారు. జపాన్ కు చెందిన ఎయిర్ వాటర్ కంపెనీ సాయంతో గ్యాస్ ఉత్పత్తి చేయగలిగామని వెల్లడించారు. ఇది పర్యావరణ రహిత రాకెట్ ఇంధనమని, ద్రవ రూపంలో వచ్చే బయోమిథేన్ సమృద్దిగా లభించనుందని కూడా తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంధన సామర్థ్యం అందించే వీలు ఉందని, అలాగే ఇంజన్ లోని పింటల్ ఇంజెక్టర్ వల్ల గ్యాస్ మంటల సామర్థ్యతను గణనీయంగా పెంచుతుందన్నారు. ఇప్పడు వాడుతుతున్న ఇంజన్లతో పోలిస్తే విడిభాగాలను పదోవంతుకు తగ్గించి ఈ రాకెట్ ఇంజన్ ను డిజైన్ చేశామని తెలిపారు. సగానికి సగం తయారీ ఖర్చులు కూడా తగ్గిపోతాయని, ప్రొపెల్లెంట్ (ద్రవ ఇంధనం, ఆక్సిడైజర్)ను పింటల్ ఇంజెక్టర్ లు నియంత్రిత పద్దతిలో రాకెట్ ఇంజన్ కంబశ్చన్ ఛాంబర్ లోకి పంపుతుందన్నారు. స్పేస్ ఎక్స్ ఇంజన్లలోనూ ఇదే ప్రయోగాన్ని వినియోగిస్తున్నామని వివరించారు. ఛాంబర్ లో గ్యాస్ మండే సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు టోక్యో యూనివర్శిటీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా)లు కలిసి జీరో ఇంజన్ కంబశ్చన్ ఛాంబర్ ను డెవలప్ చేశారు. చిన్న శాటిలైట్ లాంఛ్ వెహికిల్ ద్వారా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు కూడా తాజా ప్రయోగాలు సపోర్ట్ గా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. బయోమిథేన్ ఇంధనాన్ని వినియోగించి లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి శాటిలైట్లను ప్రయోగించాలని ఐఎస్‌టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఏది ఏమైనా గో పేడ వల్ల అత్యధ్బుతమైన లాభాలు ఉన్నాయని జపాన్ పరిశోధకులు తేల్చడం మాత్రం గర్వకారణమనే చెప్పాలి.

https://x.com/istellartech_en/status/1732698779873358329?s=20

You cannot copy content of this page