ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. నాగాలాండ్, త్రిపుర ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. దీంతో సౌత్ ఇండియాపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ ఏడాది దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ లో కర్ణాటక ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా..డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అమిత్ షా ఫోకస్ కర్ణాటక, తెలంగాణపై పడింది.
ప్రధానంగా తెలంగాణ ఎన్నికలను బీజేపీ అగ్రనాయకత్వం ప్రయారిటీగా తీసుకుంది. దీంతో త్వరలో తెలంగాణలో అమిత్ షా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది. ఎన్నికల వరకు ఇక్కడే ఉంటారని అంటున్నారు. హైదరాబాద్ లోనే ఉండి వ్యూహలను రచిస్తారని, బీజేపీని పరుగులు పెట్టిస్తారని కాషాయ నేతలు చెబుతున్నారు. ఈ నెలలో తెలంగాణకు అమిత్ షా వస్తున్నారు. ఈ పర్యటనతో టీ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. ఇక నుంచి తెలంగాణలో అమిత్ షా యాక్టివ్ రోల్ పోషిస్తారని అంటున్నారు.
నేతలను ప్రజాక్షేత్రంలోకి దింపి అమిత్ షా వెనుక నుంచి కీ రోల్ పోషిస్తారని అంటున్నారు. గట్టిగా పోరాడితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రనేతలు రంగంలోకి దిగి శ్రమిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అయితే చాలామంది నేతలు బండి సంజయ్ ఆదేశాలను పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది. దీంతో అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించనున్నారని చెబుతున్నారు.
ఇటీవల ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన 20 మంది నేతలతో అమిత్ షా, జేపీ నడ్డా సమావేశం అయ్యారు. ఈ చర్చల్లో అంతర్గతంగా ఏమి చర్చించుకున్నారనేది బయటకు రాలేదు. కానీ తెలంగాణ బీజేపీలోని నేతల మధ్య విబేధాల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విబేధాలను పక్కన పెట్టాల్సిందిగా అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీకాలం మార్చితో ముగియనుంది. దీంతో ఇంకోసారి ఆయనను కంటిన్యూ చేయడంపై నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.