సినిమా అవకాశాలంటూ… సినిమా చూపించిన అసిస్టెంట్ డైరెక్టర్

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ వ్యభిచారం రొంపిలోకి దింపుతూ కాలం వెల్లదీస్తున్న ఓ ఘరానా నేరస్థుడి గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేశారు. వెండి తెరపై కనిపించాలన్న తాపత్రయంతో మహానగరానికి చేరుకున్న వారిని చేరదీసినట్టుగా నటించి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న అసిస్టెంట్ డైరక్టర్ పై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక తెలుగు టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2017 నుంచి ఒక ప్రముఖ డైరెక్టర్ దగ్గర సురేష్ బోయిన అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. అతను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలను ముగ్గులోకి దింపి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా గోవా , బెంగళూరుకు పంపిస్తున్నట్టు గుర్తించారు.

బ్యాక్ పేజీ పేరిట…

హోటల్స్, ఓయో రూమ్స్ అడ్డాగా చేసుకొని ఈ గుట్టును బయటకు రానివ్వకుండా ఇన్నేళ్లు కాపాడుకుంటూ వచ్చాడు. వెస్ట్ బెంగాల్, ముంబై, ఢిల్లీ నుంచి అమ్మాయిలను పిలిపించి వారిని వ్యభిచారంలోకి లాగుతున్నారని తెలిసింది. బ్యాక్ పేజి వెబ్ సైట్ లో అమ్మాయిల ఫోటోలను పెడుతూ వారిని బుట్టలోకి పడేసి ఈ పని చేస్తున్నట్టు తేలింది. బ్యాక్ పేజీ పేరిట ఏర్పాటు చేసిన ఈ సైట్ వెనక అన్ని చీకటి కోణాలే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో అతని వ్యవహారంపై మరిన్ని కోణాల్లో ఆరా తీసే పనిలో పడ్డారు.

వాట్సప్ ద్వారా…

సెలెక్టెడ్ కస్టమర్లకు అమ్మాయిల ఫోటోలు పంపిస్తూ వ్యభిచార వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సురేష్ బోయినను నేడో రేపో పోలీసులు కోర్టు బోను ముందు నిలబెట్టనున్నారు. తవ్విన కొద్ది లుకలుకలే అన్నట్టుగా నిందితులు గతంలో కూడా ఇలాంటి బ్రోకర్ పనులకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 35 మంది అమ్మాయిలను ట్రాప్ లోకి దింపి వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. ప్రతి అమ్మాయి డీల్ ఒకే అయితే 40% కమిషన్ గా అఖిల్ రెడ్డి తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలుగులో ప్రముఖ డైరెక్టర్ దగ్గర పని చేస్తున్న సురేశ్ హై ఫై అమ్మాయిలను పట్టి కస్టమర్స్ కు వద్దకు పంపిస్తున్నాడని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

You cannot copy content of this page