దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహించడం అలనాటి తీపి గుర్తులను నెమరువేసుకోవడం, విద్యాబుద్దులు నేర్పించిన గురువులను సత్కరించడం కామన్ గా మారిపోయింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్యాచుల వారిగా కలుసుకుంటున్న తీరు ఆదర్శప్రాయంగా మారింది. అయితే ఇలా రోటీన్ గా ప్రోగ్రాం చేస్తే ఏం లాభం అనుకున్న ఆ విద్యార్థులకు భావి తరాలకు ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేశారు. కలియక కోసం ఆర్భాటం ఎందుకని అనుకున్న అలనాటి విద్యార్థులు నేటి తరానికి దిశా నిర్దేశం కూడా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థినీలు సకాలంలో స్కూలుకు వచ్చేందుక అవసరమైన నిర్ణయం తీసుకున్నారు. 20 మంది విద్యార్థినీలకు సైకిళ్లు అందించి తమలోని ఔదార్యాన్ని చాటుకున్నారు పూర్వ విద్యార్థులు. విద్యాగంధం అందరికీ అందడంతో పాటు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న వారికి సైకిళ్లను పంపిణీ చేయడం వల్ల స్టూడెంట్స్ రోజూ పాఠశాలకు వెల్లేందుకు ఇబ్బందులు లేకుండా పోతాయిన భావించిన పూర్వ విద్యార్థులు అపూర్వమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ… అందుబాటులో ఉన్న సౌకర్యాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్సించారు. డీపీఆర్వో మామిండ్ల దశరథం మాట్లాడుతూ… పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్న విద్యార్థులకు సైకిళ్లు అందించడం మంచి నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎ: డాక్టర్ చకినాల శ్రీనివాస్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post