మాస్టారూ మాస్టారూ… మీరే అసలైన మెగాస్టారూ…

వాగు పొంగడంతో విద్యార్థులను ఎత్తుకుని దాటిన టీచర్

దిశ దశ, మంచిర్యాల:

ఓ వైపు నిరాటంకంగా కురుస్తున్న వర్షం… గ్రామ సమీపంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్న సమయంలో క్షేమంగా ఇంటికి చేరాలన్న ఆతృత ఎవరికైనా ఉంటుంది. కానీ టీచర్ మాత్రం విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చాలని భావించాడు. బడి గంట కొట్టగానే ఇంటి దారి పట్టకుండా చిన్నారులను ఎత్తుకుని మరీ వాగు దాటి సురక్షింతగా ఇళ్లు చేర్చేందుకు శ్రమించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్ పేట (జైహింద్ పూర్) రెండు రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాల టీచర్ సేవాభావానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం గ్రామానికి చెందిన 26 మంది విద్యార్థులు నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ బడికి చేరుకున్నారు. సాయంత్రానికల్లా ఆ వాగులో నీటి ఉధృతి తీవ్రంగా పెరగడంతో పిల్లలు ఇంటికి చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో కొట్టుకపోతామోనన్న భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. అయితే పాఠశాల విడిచిపెట్టిన తరువాత టీచర్ సంతోష్ తాను సేఫ్ గా ఉంటే సరిపోతుందని భావించకుండా విద్యార్థులను ఎత్తుకుని మరీ వాగు దాటించారు. వేగంగా నీటి మీదుగా ఒక్కో విద్యార్థిని ఎత్తుకుని సురక్షితంగా వాగు దాటించారు. టీచర్ సంతోష్ చొరవతో పాఠశాల విద్యార్థులు అంతా కూడా పాఠశాల నుండి ఇంటికి చేరుకోగలిగారు. టీచర్ తీసుకున్న చొరవను గమనించిన గ్రామస్థులు కూడా చిన్నారులను దరి చేర్చేందుకు శ్రమించారు. ఏది ఏమైనా ఉపాధ్యాయుడు విద్యా అంటేబుద్దులు నేర్పించడం కాకుండా విద్యార్థుల యోగ క్షేమాలను కూడా పట్టించుకోవడం కూడా ఆదర్శంగా వ్యవహరించిన తీరుపై అభినందించారు.

You cannot copy content of this page