‘‘అభి’’కి అభినందనల వెల్లువ

దిశ దశ, రామడుగు:

తొమ్మిది ఏళ్ళ బాలుడు ఆదర్శవంతంగా నిలిచాడు. దొరికింది కదా అని సంబరపడకుండా నిజాయితీని ప్రదర్శించాడు. మనీ పర్స్ దొరకిన వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ పర్స్ పొగొట్టుకున్న వారికి అప్పగించారు టీచర్లు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలని ప్రభుత్వ పాఠశాలలో RSS శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎల్లన్న అనే వ్యక్తి పర్స్ పొయింది. స్థానిక విన్నర్స్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న నూనె అభికి ఆ పర్స్ దొరకడంతో అతను తన పాఠశాల ఉపాధ్యాయులకు అప్పగించాడు. వెంటనే పర్సులో ఉన్న వివరాలను బట్టి ఎల్లన్నకు సమాచారం ఇచ్చి అతనికి అప్పగించింది విన్నర్స్ స్కూల్ యాజమాన్యం. ఆ పర్సులో రూ. 8 వేల నగదు, ముఖ్యమైన డాక్యూమెంట్లు ఉన్నాయి. అవి అన్ని కూడా తిరిగి ఎల్లన్నకు అందించారు. ఈ సందర్భంగా నూనె అభి నిజాయితిని మెచ్చుకున్న RSS ప్రతినిధులు అతన్ని ప్రత్యేకంగా సత్కారం చేశారు. విన్నర్స్ పాఠశాల యాజమాన్యం విలువలతో కూడిన విద్యను అందించడం వల్లే విద్యార్థి నిజాయితిని ప్రధర్శించారని వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page