నిజామాబాద్ జిల్లాలో వింత ఆకారాల దర్శనం… కలవరపడుతున్న జనం

దిశ దశ, నిజామాబాద్:

వేకువ జామున ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెల్తున్నారు. రహదారిపై ఓ వింత ఆకారం కనిపించింది. అంతే ఠక్కున అక్కడే ఆగిపోయారు. వెంటనే సెల్ ఫోన్లో వింత ఆకారాన్ని రికార్డు చేసే ప్రయత్న చేశారు. అప్పటికప్పుడు ఆకారాలను మార్చుకుంటూ కనిపించిన ఆ అదృశ్య శక్తి ఎవరా అని ఆందోళనపడ్డారు. దెయ్యం కావచ్చన్న అనుమానంతో వారు కొద్దిసేపు తటపటాయించారు. చివరకు అదృశ్య శక్తి అక్కడి నుండి మాయం కావడంతో బైక్ పై వెల్తున్న వారు కూడా అక్కడి నుండి వెల్లిపోయారు. అయితే వింత ఆకారాలతో కనిపించిన అదేమిటీ..? నిజంగానే దెయ్యమా లేక… మరేదైనా ప్రాణా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. అయితే బైక్ పై వెల్తున్న వారు తీసిన ఫోటోలు నిజామాబాద్ జిల్లాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యంత విచిత్రంగా అనిపిస్తున్న ఈ ఘటనపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..?

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి సోమవారం తెల్లవారు జామున ముగ్గురు వ్యక్తులు బైక్ పై వేల్పూరు మండలం రామన్నపేటకు వెల్తున్నారు. గంగాధర్ సమీపంలోకి చేరుకున్న దీరికి ఓ వింత ఆకారం కనిపించింది. త్వరగా గమ్యం చేరాలన్న ఆతృతలో ఉన్న సమయంలో వింత ఆకారం సాక్షాత్కరించడంతో ముగ్గురు కూడా ఉలిక్కిపడ్డారు. మొదట ఓ ఆకారంలో కనిపించిన ఆ అదృశ్య శక్తి కొద్ది క్షణాల్లోనే మరో రూపానికి మారిపోయిందని, దీంతో చకా చకా తమ మొబైల్స్ లో ఫోటోలు తీసిన బైక్ వాలాలు వాటిని పరిశీలించి ఆశ్యర్యపోయారు. వెంటవెంటనే ఆకారం మార్చుకుంటూ కనిపిస్తున్న అదృశ్య శక్తి నిజంగానే దెయ్యామా అన్న భయానికి గురయ్యారు. వెంటనే తమ వాహనాన్ని భీంగల్ వైపు మల్లించి తెల్లవారిన తరువాత గమ్యస్థానానికి చేరుకున్నామని చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన పోటోలతో పాటు ఓ ఆడియోను కూడా సదరు వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో గంగాధర్ ప్రాంతంలో వింత ఆకారంలో కనిపించిన అదశ్యశక్తి ఏమై ఉంటుందా అన్న చర్చ మొదలైంది. దెయ్యాలు ఉండవని, వాటిని అదంతా ఓ బూటకమని ప్రజలు భయాందోళనకు గురి కాకూడదని తేల్చి చెప్తున్నప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వింత ఆకారాలు ఏమిటన్నదే అంతుచిక్కకుండా పోయింది. మరో వైపున ఈ వింత ఆకారం ఆకాశం నుండి దిగివచ్చిన ఏలియన్సా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. దివి నుండి భూవికి దిగి వచ్చిన ఏలియన్ అప్పటికప్పుడు తన ఆకారాలను మార్చుకుంటూ బైక్ పై వెల్తున్న వారికి కనిపించి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.

నిజమేనా..?

అయితే వింత ఆకారాల్లో కనిపించిన ఈ అదృశ్య శక్తి బైక్ వాలాలకు కనిపించింది నిజమేనా కాదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వింత ఆకారంలో కనిపించినట్టుగా చెప్తున్నప్పటికీ తెల్లవారు జామున వారికి మాత్రమే కనిపించిందా ఆ ప్రాంతంలో తిరిగిన మిగతా వారికి కూడా కనిపించిందా లేదా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా గంగాధర్ ప్రాంతంలో కనిపించిన ఈ అదృశ్య శక్తుల గురించి మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page