శిశు గృహ నుండి ఇటలీకి… కరీంనగర్ నుండి మరో బాలుడి దత్తత

దిశ దశ, కరీంనగర్: కరీంనగర్ శిశు గృహలో ఉంటున్న ఆ బాలుడిని దత్తత తీసుకునేందుకు ఇటలీ నుండి దంపతులు వచ్చారు. గతంలో కూడా కరీంనగర్ కు చెందిన ఒక అనాథను విదేశీయులకు దత్తత ఇవ్వగా తాజాగా మరోబాలున్ని కూడా అడాప్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరే పమేలా సత్పతి సమక్షంలో దత్తత కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ లోని శిశు గృహలో ఆరేళ్ల బాలుడు ఉన్న విషయం తెలుసుకున్న ఇటలీకి చెందిన దంపతులు జిల్లా అధికారులను సంప్రదించారు. దత్తత తీసుకునేందుుక ముందుకు వచ్చిన దంపతుల నేపథ్యంతో పాటు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న జిల్లా అధికారులు వారికి బాలుడిని దత్తత ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.

అలాగే జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కూడా దతత్త తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సోమవారం కరీంనగర్ కు వచ్చిన ఇటాలియన్ ఫ్యామిలీకి కరీంనగర్ శిశు గృహకు చెందిన ఆరేళ్ల బాలుడిని అప్పగించారు. బాలుడికి పాస్ పోర్ట్ ఇప్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఏం సరస్వతి మాట్లాడుతూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నియమాల ప్రకారం ఇటలీ దంపతులకు కరీంనగర్ శిశు గృహాలో పెరుగుతున్న ఆరు సంవత్సరాల బాబును దత్తతకు ఇచ్చామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితాదేవి, మార్కెటింగ్ డిడి పద్మావతి, డి సి పి ఓ శాంత, ఐసిపిఎస్ సిబ్బంది తిరుపతి, తేజస్వి పాల్గొన్నారు.

You cannot copy content of this page