స్లీపర్ వందే భారత్…

వచ్చే ఏడాది స్టార్ట్

దిశ దశ, న్యూ ఢిల్లీ:

వందే భారత్ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు రానున్నాయి. ఇంత కాలం సీటింగ్ సౌకర్యానికి పరిమితమైన వందే భారత్ ట్రైన్ లో స్లీపర్ సిస్టం ప్రారంభం కాబోతున్నది. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న వందే భారత్ రైళ్లలో స్లీపర్ సేవలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 16 కోచుల(బోగీలు) ద్వారా 887 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే విధంగా స్లీపర్ వందే భారత్ రైళ్లను డిజైన్ చేశారు. ఇప్పటికే 75 సీటింగ్ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన ఇండియన్ రైల్వే వచ్చే ఏడాది నుంచి స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మూడు రకాల సాంకేతికతతో మొత్తం 400 రైళ్లను సిద్ధం చేసే యోచనలో ఉంది. స్లీపర్ వందే భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. చైర్ కార్ తో పాటు స్లీపర్ సిస్టం కూడా ఉంటే బావుండేది అని అనుకున్న రైల్ ప్రయాణీకులు వచ్చే ఏడాది నుంచి ఆ సౌకర్యాన్ని కూడా పొందనున్నారు.

You cannot copy content of this page