దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:
జమ్మూ కశ్మీర్ లో జరిగిన ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆర్మీ టెక్నిషియన్ మృత్యువాత పడ్డాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బల్ల అనిల్ ఆర్మీలో టెక్నిషియన్ గా పని చేస్తున్నారు. గురువారం విధి నిర్వహణలో భాగంగా ఆర్మీ హెలిక్యాప్టర్ లో ప్రయాణిస్తుండగా కిష్తార్ జిల్లా నదిలో ఏఎల్ హెచ్ ధృవ్ పడిపోయింది. ఈ ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనీల్ కుభార్య సౌజన్య, కుమారులు ఆయన్ (6), అరో (3)లు ఉన్నారు. 10 రోజుల క్రితం వరకు స్వగ్రామంలోనే ఉండి వెల్లిన అనిల్ మరణం వార్త తెలిసి అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 45 రోజుల పాటు సెలవుపై వచ్చి 10 రోజుల క్రితం విధుల్లో చేరేందుకు వెల్లాడని గ్రామస్థులు తెలిపారు. గురువారం ఆర్మీ హెలిక్యాప్టర్ ప్రమాదంలో అనీల్ చనిపోయాడన్న సమాచారం ఆర్మీ అధికారులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు.
బండి దిగ్భ్రాంతి…
ఆర్మీలో టెక్నిషియన్ గా పనిచేస్తున్న అనిల్ ప్రమాదంలో మరణించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న తరువాత అనిల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సంజయ్ అన్ని విధాలుగా బాసటగా ఉంటామన్నారు. జిల్లా పార్టీ నాయకులు కూడా అనిల్ కుటుంబానికి అవసరమైన సేవలందించాలని కోరారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post